• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VAKEEL SAAB ACTRESS NIVETHA THOMAS RESPONDS ON TROLLING AND GIVEN CLARITY ABOUT HER CORONA PK

Nivetha Thomas: కరోనాతో థియేటర్‌కు వస్తావా.. విమర్శలపై స్పందించిన నివేదా థామస్..

Nivetha Thomas: కరోనాతో థియేటర్‌కు వస్తావా.. విమర్శలపై స్పందించిన నివేదా థామస్..

నివేదా థామస్ (Nivetha Thomas)

Nivetha Thomas: దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత చిన్నా పెద్దా ముసలి ముతకా అని తేడా లేకుండా అందరికీ వచ్చేస్తుంది. ముఖ్యంగా సినిమా వాళ్లైతే దాని బారిన రోజుకు చాలా మంది పడుతున్నారు. అందులో నివేదా థామస్(Nivetha Thomas) కూడా ఉంది. అయితే ఈమెపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.

  • Share this:
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా గతవారం విడుదలైంది. దీనికి మంచి టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఈ చిత్రంలో అంజలి, అనన్యలతో పాటు నివేదా థామస్ కూడా నటించింది. అయితే ప్రమోషన్స్ కొన్ని రోజుల తర్వాత ఈమె కనిపించడం మానేసింది. దానికి కారణం నివేదాకు కరోనా రావడమే. దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు మొదటి రోజు కూడా ఈ సినిమాను చూడలేకపోయింది. క్వారంటైన్‌లోనే ఉండిపోయింది నివేదా థామస్. ఇదిలా ఉంటే ఈమెపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. కరోనా సోకడంతో క్వారెంటైన్‌లో ఉండాల్సిన ఆమె ఉన్నట్లుండి ‘వకీల్ సాబ్’ సినిమా థియేటర్‌లో మాస్క్ పెట్టుకుని కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ మూమెంట్ కోసమే ఎదురు చూశానంటూ క్యాప్షన్ జోడించింది నివేదా. దాంతో నెటిజన్లు ఈమెపై ఫైర్ అయ్యారు. కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుకుండా ఇలా బయటికి వస్తారా.. కనీసం బాధ్యత లేదా అంటూ ఈమెపై మండి పడ్డారు.

మీరే ఇలా చేస్తే ఎలా.. ఇక కామన్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి.. వాళ్లు ఎవరి మాట వింటారు చెప్పండి అంటూ మరికొందరు సాఫ్టుగానే ఈమెను ప్రశ్నించారు. అయితే తనపై జరుగుతోన్న ట్రోలింగ్ చూసిన నివేదా థామస్ ఇప్పుడు స్పందించింది.
nivetha thomas,nivetha thomas twitter,nivetha thomas instagram,nivetha thomas corona theatre,nivetha thomas responds over trolling,nivetha thomas about coronavirus,actress nivetha thomas,nivetha thomas tweets,actress nivetha thomas test positive,nivetha thomas tests positive for covid 19,nivetha thomas vakeel saab,నివేదా థామస్,నివేదా థామస్ కరోనా వైరస్,నివేదా థామస్ ట్రోలింగ్
నివేదా థామస్ (Nivetha Thomas)

తనకు కరోనా తగ్గిపోయిందని.. రిజల్ట్ కూడా నెగెటివ్ వచ్చిందని చెప్పింది. నెగిటివ్ వచ్చిన తర్వాతే తాను థియేటర్‌కు వచ్చానని తెలిపింది. వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ సమయంలో తనకు కోవిడ్ రావడం బాధగా అనిపించిందని.. కానీ కొన్ని రోజుల తర్వాత తగ్గిపోయి నెగిటివ్ వచ్చిందని చెప్పుకొచ్చింది నివేదా. అలా వచ్చిన తర్వాతే తాను థియేటర్ వరకు వచ్చి సినిమా చూద్దామని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారని.. అందుకే ఆగిపోయానని తెలిపింది.
nivetha thomas,nivetha thomas twitter,nivetha thomas instagram,nivetha thomas corona theatre,nivetha thomas responds over trolling,nivetha thomas about coronavirus,actress nivetha thomas,nivetha thomas tweets,actress nivetha thomas test positive,nivetha thomas tests positive for covid 19,nivetha thomas vakeel saab,నివేదా థామస్,నివేదా థామస్ కరోనా వైరస్,నివేదా థామస్ ట్రోలింగ్
నివేదా థామస్ (Nivetha Thomas)

కానీ ఒక్కసారి బయటకి వెళ్లి థియేటర్‌లో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలనిపించిందని.. అందుకే వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. కరోనా కారణంగా అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా కలవలేకపోవడం బాధగా ఉందని చెప్పింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. అందరూ మాస్కులు పెట్టుకుని.. సోషల్ డిస్టేన్స్ పాటిస్తూ సినిమా చూడాలని కోరింది నివేదా. ఏదేమైనా కూడా నిజాలు తెలుసుకోకుండా ఈమెపై ట్రోల్ చేయడం ఏంటి అంటూ నివేదా అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు