• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VAISSHNAV TEJ KRITHI SHETTY LATEST BLOCKBUSTER UPPENA MOVIE 25 DAYS WW COLLECTIONS PK

Uppena 25 days WW collections: ‘ఉప్పెన’ 25 డేస్ కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా..?

Uppena 25 days WW collections: ‘ఉప్పెన’ 25 డేస్ కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా..?

ఉప్పెన సినిమా (Uppena movie)

Uppena 25 days WW collections: ‘ఉప్పెన’.. మరో ఐదారేళ్లకు సరిపోయే గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమా. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ చిత్రం వింటర్‌లో విడుదలై మండే ఎండల్లోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది.

  • Share this:
‘ఉప్పెన’.. మరో ఐదారేళ్లకు సరిపోయే గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమా. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ చిత్రం వింటర్‌లో విడుదలై మండే ఎండల్లోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. విడుదలైన మూడు వారాల తర్వాత కూడా ఇప్పటికీ మంచి వసూళ్లనే తీసుకొస్తుంది ఉప్పెన. నిజానికి ఈ చిత్రం వచ్చిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు దానికి పోటీగా నిలబడే మరో సినిమా బాక్సాఫీస్ దగ్గర రాలేదు. దాంతో ఆడియన్స్ కూడా పూర్తిగా ఉప్పెన వైపు వెళ్లిపోయారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం ఫుల్ రన్‌కు దగ్గరికి వచ్చేసింది. ఇప్పటి వరకు 25 రోజుల్లో 50.77 కోట్ల షేర్ వసూలు చేసింది. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటూ దర్శక నిర్మాతలు పోస్టర్ కూడా విడుదల చేసారు. మరి ఏరియా వైజ్‌గా ఈ సినిమా ఎక్కడెక్కడ ఎంత వసూలు చేసిందో చూద్దాం..

నైజాం: 15.41 కోట్లు
సీడెడ్: 7.69 కోట్లు
ఉత్తరాంధ్ర: 8.48 కోట్లు
ఈస్ట్: 5.03 కోట్లు
వెస్ట్: 2.61 కోట్లు
గుంటూరు: 2.96 కోట్లు
కృష్ణా: 3.13 కోట్లు
నెల్లూరు: 1.75 కోట్లు

AP-TG 25 రోజుల మొత్తం: 47.24 కోట్లు షేర్ (75 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 2.35 కోట్లు
ఓవర్సీస్ – 1.38 కోట్లు

వరల్డ్ వైడ్ 25 రోజుల మొత్తం – 50.77 కోట్లు షేర్
Published by:Praveen Kumar Vadla
First published: