VAISSHNAV TEJ KETIKA SHARMA RANGA RANGA VAIBHAVANGA SHOOT COMPLETED HERE ARE THE DETAILS SR
Vaisshnav Tej: షూటింగ్ పూర్తి చేసుకున్న వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా..
Ranga Ranga Vaibhavanga Photo : Twitter
Vaisshnav Tej: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్. ఉప్పెన తర్వాత ఆయన నటించిన సినిమా కొండపొలం (Kondapolam). ఈ చిత్రం 2021 అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో (Kondapolam on Amazon Prime) స్ట్రీమ్ అవుతోంది. రకుల్ ప్రీత్ హీరోయిన్గా చేసింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. క్రిష్ దర్శకత్వం వహించారు. ఇక అది అలా ఉంటే వైష్ణవ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga ).. ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. ఈ (Ranga Ranga Vaibhavanga ).. సినిమా అప్పుడే షూటింగ్ పూర్తి చేసుకుందట. దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో త్వరలో విడుదల తేదీని ప్రకటించనుంది టీమ్. ఇక ఆ మధ్య ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేసింది టీమ్. తెలుసా తెలుసా అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా.. శంకర్ మహాదేవన్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ (Ranga Ranga Vaibhavanga ).. సినిమాకుగీరిషయ్య దర్శకత్వం వహిస్తున్నారు.
హీరోయిన్గా రొమాంటిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ (Ketika sharma) కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్ చేయబోతుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుంది. మొదటి రెండు సినిమాలతో పోలిస్తే.. రంగరంగ వైభవంగా కోసం మరింత స్టైలిష్‌గా మారిపోయారు వైష్ణవ్.
— TBO : Today Box Office (@TodayBoxOffice) March 2, 2022
ఇక వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ సినిమా కొండపొలం విషయానికి వస్తే.. రవీంద్రనాథ్ గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తి. బిటెక్ చేసిన రవి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. ఎంత ప్రయత్నించినా రవి ఉద్యోగం రాదు. దీంతో తన సొంత ఊరికి చేరుతాడు. ఇక తన తండ్రితో పాటు గొర్రెల్ని మేపడం కోసం కొండపొలానికి వెళ్లడం అక్కడ ఏం జరిగింది. రకుల్ పాత్ర ఏమిటీ. రవి ఐ.ఎఫ్.ఎస్ ఎలా ఎంపిక అయ్యాడు అనేవి కథలో ముఖ్యాంశాలు. ఈ సినిమాలో (Rakul Preet Singh) రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.