మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్. ఉప్పెన తర్వాత ఆయన నటించిన సినిమా కొండపొలం (Kondapolam). ఈ చిత్రం 2021 అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో (Kondapolam on Amazon Prime) స్ట్రీమ్ అవుతోంది. రకుల్ ప్రీత్ హీరోయిన్గా చేసింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. క్రిష్ దర్శకత్వం వహించారు. ఇక అది అలా ఉంటే వైష్ణవ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా.. ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేసింది టీమ్. తెలుసా తెలుసా అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా.. శంకర్ మహాదేవన్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇద్దరు ప్రేమికుల మధ్య వచ్చిన భిన్నాభిప్రాయాలను, గందరగొళాన్ని ఈ పాటలో చెప్పే ప్రయత్నం చేశారు రచయిత. ఇక ఈ సినిమాకుగీరిషయ్య దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్ చేయబోతుంది. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్ కూడా చాలా రొమాంటిక్‌గా ఉంది. బటర్ ఫ్లై కిస్ కావాలా అంటూ హీరో హీరోయిన్ల మధ్య మంచి రొమాంటిక్ టీజర్ కట్ చేసారు దర్శక నిర్మాతలు.
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుంది. టైటిల్ టీజర్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది. ఈ సినిమా కోసం వైష్ణవ్ తేజ్ తనను తాను చాలా మార్చుకున్నాడు. లుక్ పరంగా కూడా కొత్తగా కనిపిస్తున్నారు. మొదటి రెండు సినిమాలతో పోలిస్తే.. రంగరంగ వైభవంగా కోసం మరింత స్టైలిష్‌గా మారిపోయారు.
The journey of Rishi and Radha in a lovely tune, #TelusaTelusa❤️ from #RangaRangaVaibhavanga is out now!
▶️https://t.co/WR7pWvOsOl
A Rockstar @ThisIsDSP Musical?
Directed by @GIREESAAYA#PanjaVaisshnavTej #Ketikasharma #RRVTheFilm @SVCCofficial @BvsnP @SonyMusicSouth pic.twitter.com/C0QbvPkPzk
— SVCC (@SVCCofficial) February 3, 2022
ఇక వైష్ణవ్ తేజ్ కొండపొలం విషయానికి వస్తే.. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రవీంద్రనాథ్ గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తి. బిటెక్ చేసిన రవి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. ఎంత ప్రయత్నించినా రవి ఉద్యోగం రాదు. దీంతో తన సొంత ఊరికి చేరుతాడు. ఇక తన తండ్రితో పాటు గొర్రెల్ని మేపడం కోసం కొండపొలానికి వెళ్లడం అక్కడ ఏం జరిగింది. రకుల్ పాత్ర ఏమిటీ. రవి ఐ.ఎఫ్.ఎస్ ఎలా ఎంపిక అయ్యాడు అనేవి కథలో ముఖ్యాంశాలు. ఈ సినిమాలో (Rakul Preet Singh) రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసారు. క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.