• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VAISHNAVI TEJ SAYS FANS TO HE HAS NO TWITTER ACCOUNT HERE ARE THE DETAILS TA

Vaishnav Tej: అభిమానులకు ఆ రకంగా షాక్ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్..

Vaishnav Tej: అభిమానులకు ఆ రకంగా షాక్ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్..

వైష్ణవ్ తేజ్

Vaishnav Tej | మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇటీవల ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. తాజాగా వైష్ణవ్ తేజ్ అభిమానులకు ఆ రకంగా షాక్ ఇచ్చాడు.

  • Share this:
    Vaishnav Tej | మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇటీవల ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. అన్న సాయి ధరమ్ తేజ్‌కు సాధ్యం కానీ రికార్డులకు మొదటి సినిమాతో అందుకొని మెగా హీరోలకే షాక్ ఇచ్చాడు.బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి నిర్మించాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్‌‌ను అందుకుందని తాజాగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దీంతో వైష్ణవ్ తేజ్‌తో వరుస సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.

    మరోవైపు వైష్ణవ్ తేజ్‌కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగుతూనే ఉంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. తన పేరుతో ఉన్న అకౌంట్‌ను ఎవరో ఫాలో కావొద్దని అభిమానులను కోరాడు. ఈ మేరకు వైష్ణవ్ తేజ్ ఓ ప్రకటన చేసాడు. నేను ఇప్పటి వరకు ట్విట్టర్‌లో జాయిన్ కాలేదు. తన పేరుతో ఉన్న ఖాతాలకు తనకు సంబంధం లేదన్నారు. నా పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌ను అభిమానులు ఎవరు ఫాలో కావొద్దని చెప్పుకొచ్చాడు.

    chiranjeevi gives costly gift to uppena fame vaishnav, Vaishnav Tej look, Vaishnav Tej krish jagarlapudi Rakul preet singh kondapolam, Vaishnav Tej, Vaishnav Tej new movies, Vaishnav Tej news, Vaishnav Tej kondapolam, Rakul preet singh,Rakul preet singh news, Rakul preet singh latest fillm,tollywoodnews
    వైష్ణవ్ తేజ్ (Twitter/Photo)


    ఇక అది అలా ఉంటే వైష్ణవ్ ప్రస్తుతం నాగార్జున నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు ఆయన క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొండపొలం, లేదా జంగిల్ బుక్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

    Vaishnav Tej krish jagarlapudi Rakul preet singh kondapolam, Vaishnav Tej, Vaishnav Tej new movies, Vaishnav Tej news, Vaishnav Tej kondapolam, Rakul preet singh,Rakul preet singh news, Rakul preet singh latestVaishnav Tej krish jagarlapudi Rakul preet singh kondapolam, Vaishnav Tej, Vaishnav Tej new movies, Vaishnav Tej news, Vaishnav Tej kondapolam, Rakul preet singh,Rakul preet singh news, Rakul preet singh latest fillm,tollywoodnews fillm,tollywoodnews
    వైష్ణవ్ తేజ్, క్రిష్ (Twitter/Photos)


    ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసిందని టాక్. ఉప్పెన సినిమా భారీ వసూళ్లను రాబట్టడటంతో ఈ సినిమాకు మంచి ధర పలికినట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 11 కోట్ల రూపాయలకు అమ్మడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆగస్టులో విడుదలచేయాలనీ చూస్తున్నారట దర్శక నిర్మాతలు
    Published by:Kiran Kumar Thanjavur
    First published: