Uppena Pre Release Business: ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ బిజినెస్.. వైష్ణవ్ తేజ్ ముందు భారీ టార్గెట్..

ఉప్పెన పోస్టర్ (Uppena movie)

Uppena Pre Release Business: మెగా కుటుంబం నుంచి హీరో వస్తున్నాడంటే ఎందుకో తెలియదు కానీ బయ్యర్లకు కూడా పెద్దగా భయం ఉండదు. అందుకే బిజినెస్ బాగా జరుగుతుంటుంది. అలాగే బడ్జెట్ కూడా భారీగానే పెడుతుంటారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ విషయంలోనూ..

  • Share this:
మెగా కుటుంబం నుంచి హీరో వస్తున్నాడంటే ఎందుకో తెలియదు కానీ బయ్యర్లకు కూడా పెద్దగా భయం ఉండదు. అందుకే బిజినెస్ బాగా జరుగుతుంటుంది. అలాగే బడ్జెట్ కూడా భారీగానే పెడుతుంటారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయన హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాపై ముందు నుంచి కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా ప్రొడక్షన్ హౌజ్ బ్యాక్ చేయడం.. సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తుండటంతో ఉప్పెనపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా అందరికీ షాక్ ఇస్తున్నాయి. 2021లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఉప్పెనదే హైయ్యస్ట్. క్రాక్ సినిమా బిజినెస్ కూడా క్రాస్ చేసింది ఉప్పెన. ఫిబ్రవరి 12న వాలెంటైన్ డే వీకెండ్ కానుకగా విడుదల కానుంది ఉప్పెన. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో నిర్మాతలు కూడా నమ్మకంగానే కనిపిస్తున్నారు. దానికి తోడు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాను భారీ రేట్లకు సొంతం చేసుకున్నారు. ఏడాదిగా విడుదల కాకుండా ఉన్న ఈ సినిమాకు ఓటీటీల నుంచి భారీ ఆఫర్స్ వచ్చాయి. అయినా కూడా వాళ్లకు ఇవ్వకుండా ఆపి ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. వాళ్ల నమ్మకమే నిజమై ఇప్పుడు బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది.

uppena movie,uppena movie pre release business,uppena movie vijay sethupathi,uppena movie business,uppena movie vaishnav tej krithi shetty,uppena movie release date,telugu cinema,ఉప్పెన,ఉప్పెన సినిమా,ఉప్పెన ప్రీ రిలీజ్ బిజినెస్,వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా
వైష్ణవ్ తేజ్ ఉప్పెన (Uppena movie)


ఈ సినిమాకు ఏకంగా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కోస్తా ఆంధ్రా హక్కులు ఒక్కటే రేషియో పద్ధతిలో 20 కోట్లకు అమ్ముడయ్యాయంటే ఉప్పెన సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నైజాం, సీడెడ్‌లోనూ అద్భుతమైన బిజినెస్ చేసింది ఈ చిత్రం. అన్ సీజన్‌లో విడుదల అవుతున్న ఉప్పెనకు 22 కోట్ల షేర్ రాబట్టడం అంత ఈజీ కాదు.. కానీ పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతానని ధీమాగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు.

uppena movie,uppena movie pre release business,uppena movie vijay sethupathi,uppena movie business,uppena movie vaishnav tej krithi shetty,uppena movie release date,telugu cinema,ఉప్పెన,ఉప్పెన సినిమా,ఉప్పెన ప్రీ రిలీజ్ బిజినెస్,వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా
వైష్ణవ్ తేజ్ ఉప్పెన (Uppena movie)


ఇప్పటికే సంక్రాంతి సినిమాల ఒరిజినల్ ప్రింట్స్ వచ్చేయడంతో బయట థియేటర్స్‌లో కొత్త సినిమాలు లేక బోసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వస్తున్న ఉప్పెన కచ్చితంగా వసూళ్ల ఉప్పెన సృష్టించడం ఖాయం ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే. విజయ్ సేతుపతి ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: