Uppena teaser: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్.. బుధవారం విడుదల అయ్యింది. ఫీల్ గుడ్‌గా వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మొదటి సినిమానే అయినప్పటికీ.. అటు వైష్ణవ్ తేజ్, ఇటు కృతి శెట్టి అదరగొట్టేశారంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం ఈ టీజర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఉప్పెన టీజర్‌కి ఇప్పటికే 3 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా.. యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్ 1లో ఉంది. ఇక ఈ టీజర్‌తో అటు మెగాభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినిమా హిట్టు గ్యారెంటీ అని అందరూ అనుకుంటున్నారు.
కాగా ఈ మూవీ టీజర్ చివర్లో వైష్ణవ్ తేజ్‌ని చంపేసి పడేసినట్లు చూపించారు. సాధారణంగా తెలుగు సినిమాల్లో హ్యాపీ ఎండింగ్‌నే ప్రేక్షకులు కోరుకుంటారు. బయోపిక్‌లను పక్కనపెడితే ప్రేమ సినిమాలు విషాదంగా ముగిస్తే అస్సలు ఒప్పుకోరు. ఇలా సాడ్ ఎండింగ్‌తో వచ్చిన చాలా సినిమాలు వెండితెరపై ఫ్లాప్ అయ్యాయి కూడా. అయితే ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది. బలమైన కథ ఉండి, ఏ ఎండింగ్ ఉన్నా ఇక్కడి ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాడ్ ఎండింగ్‌తో వచ్చిన నిన్నుకోరి, కలర్ ఫొటో వంటి చిత్రాలు పెద్ద విజయాలను సాధించాయి.
ఇక టీజర్ ప్రకారం.. ఉప్పెనలో కూడా హీరోను చంపేస్తారని తెలుస్తోంది. ఈ సీన్ సినిమా మధ్యలో వచ్చేదో..? లేక నిజంగానే ఈ సీన్‌తోనే సినిమా ముగుస్తుందో తెలీదు గానీ.. ఈ టీజర్ చూసిన చాలా మందిలో ఓ అనుమానం మెదులుతోంది. ఉప్పెన మూవీ విషాదంగా ముగియనుందా..? అని. ఒకవేళ అదే నిజమైతే కలర్ ఫొటో, నిన్ను కోరిలా ఈ మూవీ మంచి విజయాన్ని సాధించి సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తుందేమో చూడాలి. అలా కాకుండా అది మధ్యలో సీన్ అయ్యి.. చివరకు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కలిస్తే మాత్రం కచ్చితంగా హ్యాపీ ఎండింగ్ అవుతుంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.