Ram Charan - Vaishnav Tej: మేనల్లుడు కుమ్మేస్తున్నాడు.. వసూళ్ల ‘ఉప్పెన’లో కొట్టుకుపోయిన ‘చిరుత’..

చిరుత ఉప్పెన పోస్టర్స్ (Chirutha Uppena posters)

Ram Charan - Vaishnav Tej: ఉప్పెన.. ఉప్పెన.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. సినిమా యావరేజ్ అని తొలిరోజే ప్రేక్షకులు తేల్చేసినా కూడా కలెక్షన్లు మాత్రం సముద్రమంత వస్తున్నాయి.

  • Share this:
ఉప్పెన.. ఉప్పెన.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. సినిమా యావరేజ్ అని తొలిరోజే ప్రేక్షకులు తేల్చేసినా కూడా కలెక్షన్లు మాత్రం సముద్రమంత వస్తున్నాయి. మూడు రోజుల్లోనే ఈ సినిమా 28 కోట్ల షేర్ వసూలు చేసి అందరి అంచనాలను తలకిందులు చేసింది. అంతేకాదు ఎన్నో రికార్డులను కూడా తన పేర రాసుకుంటున్నాడు కొత్త హీరో వైష్ణవ్ తేజ్. ఇప్పటికే ఖైదీ నెం 150, అరవింద సమేత, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలను కూడా దాటేసాడు వైష్ణవ్. దాని వెనక చిన్న లాజిక్ ఉంది. విడుదలైన మూడో రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 8.20 కోట్ల షేర్ వసూలు చేసింది. చిరు, మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాలు కూడా విడుదలైన మూడో రోజు అంతగా కలెక్ట్ చేయలేదు. ఈ విషయంలో అల వైకుంఠపురములో, సైరా మాత్రమే ముందున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఉప్పెన దెబ్బకు మరో రికార్డు కూడా చెరిగిపోయింది. 14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న చిరుత రికార్డులను పటాపంచలు చేసాడు మెగా మేనల్లుడు. డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రామ్ చరణ్ చిరుత ఇప్పటి వరకు ఉంది. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో 25 కోట్ల షేర్ వసూలు చేసింది. చిరంజీవి కొడుకు కావడంతో తొలి సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.
uppena collections,uppena crossed chirutha collections,ram charan,vaishnav tej,vaishnav tej Uppena collections,uppena 1st weekend collection,ram charan chirutha collections,telugu cinema,రామ్ చరణ్ చిరుత కలెక్షన్స్,ఉప్పెన ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,ఉప్పెన దెబ్బకు చిరుత పరార్,చిరుత రికార్డులను తిరగరాసిన ఉప్పెన
చిరుత ఉప్పెన పోస్టర్స్ (Chirutha Uppena posters)

దానికి తగ్గట్లుగానే సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మరే కొత్త హీరో కూడా 25 కోట్ల మార్క్ అందుకోలేదు. మధ్యలో అఖిల్ ఒక్కడే కచ్చితంగా ఈ రికార్డు బ్రేక్ చేస్తాడని అంతా అనుకున్నారు కానీ డిజాస్టర్ ఇచ్చాడు. ఇక మెగా కుటుంబం నుంచి వచ్చిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శిరీష్ లాంటి హీరోలు కూడా చిరుత రికార్డులకు చాలా దూరంలోనే ఆగిపోయారు. అఖిల్, నాగ చైతన్యకు కూడా సాధ్యం కాలేదు. ఇలాంటి సమయంలో కేవలం మూడంటే మూడే రోజుల్లో కలెక్షన్ల ఉప్పెన సృష్టించాడు వైష్ణవ్ తేజ్.
uppena collections,uppena crossed chirutha collections,ram charan,vaishnav tej,vaishnav tej Uppena collections,uppena 1st weekend collection,ram charan chirutha collections,telugu cinema,రామ్ చరణ్ చిరుత కలెక్షన్స్,ఉప్పెన ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,ఉప్పెన దెబ్బకు చిరుత పరార్,చిరుత రికార్డులను తిరగరాసిన ఉప్పెన
చిరుత ఉప్పెన పోస్టర్స్ (Chirutha Uppena posters)

ఈ సినిమా 3 రోజుల్లోనే చిరుత రికార్డులకు చెక్ పెట్టేసింది. ఇప్పటికే మూడు రోజుల్లో 50 కోట్ల గ్రాస్.. 28 కోట్ల షేర్ వసూలు చేసి సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది. ఇప్పటికీ ఉప్పెన కలెక్షన్స్ అలాగే ఉన్నాయి. డెబ్యూ హీరోల్లో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డులను తన పేర రాసుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్. ఏదేమైనా కూడా 14 ఏళ్ళ తర్వాత చిరుత రికార్డులను బయటి హీరో కాకుండా మెగా హీరోనే క్రాస్ చేయడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు.
Published by:Praveen Kumar Vadla
First published: