Home /News /movies /

ఓటీటీకి బైబై చెప్పిన ఉప్పెన.. డీల్ కుదరలేదట..

ఓటీటీకి బైబై చెప్పిన ఉప్పెన.. డీల్ కుదరలేదట..

వైష్ణవ్ తేజ్ (vaishnav tej)

వైష్ణవ్ తేజ్ (vaishnav tej)

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నసినిమా 'ఉప్పెన'.

    కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. అంతేకాకుండా థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య నాని నటించిన వి, రామ్ హీరోగా వస్తోన్న రెడ్, అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న నిశ్శబ్దం సినిమాలు ఓటీటీలో విడుదలకానున్నాయని టాక్ నడిచింది. కానీ విడుదలకాలేదు. అయితే ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా థియేటర్‌లో రిలీజ్ కాకుండా డెరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరువాలేదనిపించింది. అందాలతార కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' అనే తమిళ చిత్రం కూడా ముందుగా డిజిటల్ మీడియా ద్వారా విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రాన్ని లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో కాకుండా, అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెల 19న విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో స్ట్రీమ్ కానుంది.

    కాగా  మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నసినిమా 'ఉప్పెన' కూడా డిజిటల్‌లో విడుదలౌతుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ పై బుచ్చిబాబు దర్సకత్వం వహించాడు. ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. దాంతో ఈసినిమాను డిజిటల్ రిలీజ్ చెయ్యాలని ప్రయత్నాలు జరిగిన డీల్ కుదరకపోవడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఉప్పెన చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 18 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఓటీటీ సంస్థలు చిత్రానికి రూ. 14 కోట్ల ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. హీరోయిన్‌గా కృతి శెట్టి నటించగా, విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Aha OTT Platform, Amazon prime, Sukumar, Tollywood Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు