Vaishnav Tej - Uppena Collections: వైష్ణవ్ తేజ్ తోపు.. ఆ విషయంలో ప్రభాస్, ఎన్టీఆర్‌ని దాటిపోయాడు..

Vaishnav tej Uppena Crossed Prabhas and Ntr Movie collection which released in February

Vaishnav Tej - Uppena Collections: వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఉప్పెన కలెక్షన్స్ పరంగా ఫిబ్రవరి నెలలో విడుదలైన స్టార్ హీరోల సినిమాల వసూళ్లను సునాయసంగా దాటేసింది. ఇంతకీ వైష్ణవ్ తేజ్ ఉప్పెన దాటేసిన ఆస్టార్ హీరోలెవరు, ఆ సినిమాల వివరాలు చదివేయండి

  • Share this:
    వైష్ణ‌వ్‌తేజ్ ‘ఉప్పెన‌’ సినిమా ఏ ముహూర్తంలో ప్రారంభ‌మైందో కానీ.. విడుద‌ల త‌ర్వాత క‌లెక్ష‌న్స్ ప‌రంగా రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. డెబ్బై కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించిందీ చిత్రం. ఓ డెబ్యూ హీరో సినిమాకు ఈ మేర‌కు క‌లెక్ష‌న్స్ రావ‌డం రికార్డ్ అని ట్రేడ్ వ‌ర్గాలు చెప్పేశాయి. ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన తెలుగు సినిమాల్లోనూ ఉప్పెన ఓ రిక్డార్ క్రియేట్ చేసింద‌ని లేటెస్ట్ స‌మాచారం. ఉప్పెన సినిమాకు రు.49 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. 2017లో విడుద‌లైన నేను లోక‌ల్ సినిమాకు రు.35 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి.

    2015లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన టెంప‌ర్ కూడా ఫిబ్ర‌వరిలోనే విడుద‌లైంది. టెంప‌ర్ సినిమాకు రు.44.4కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. అలాగే 2013లో విడుద‌లైన ప్ర‌భాస్ మిర్చి సినిమా రు.48.5 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది. ఈ లెక్క‌న చూస్తే ఫిబ్ర‌వ‌రిలో నెల‌లో విడుద‌లై భారీ క‌లెక్ష‌న్స్ సాధించిన స్టార్ హీరోలైన ప్ర‌భాస్, ఎన్టీఆర్ సినిమాల‌కు కూడా ఉప్పెన క‌లెక్ష‌న్స ప‌రంగా క్రాస్ చేసేసింది. త‌మ మెగా క్యాంప్ హీరో తొలి సినిమాతోనే ఇలా రికార్డులు క్రియేట్ చేయ‌డంతో మెగా ఫ్యాన్స్ సంబ‌రాల‌కు హ‌ద్దే లేకుండా పోయింది. మా వైష్ణ‌వ్ తేజ్ తోపు అని సంబ‌ర‌ప‌డుతున్నారు. మ‌రో రెండు వ‌రుస హిట్ సినిమాలు ప‌డితే ఇక వైష్ణ‌వ్ తేజ్ స్టార్ హీరోల లిస్టులో చేర‌డం ప‌క్కా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మ‌రి వైష్ణ‌వ్ తేజ్ ఫ్యాన్స్ ఆశ‌ల‌ను నిల‌బెడ‌తాడో లేదో చూడాలి.

    సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించాయి. సుకుమార్ బ్యాక్‌బోన్‌లా నిలిచి సినిమా స‌క్సెస్‌లో కీల‌క పాత్ర వహించాడు. ఒక‌వైపు వైష్ణ‌వ్ తేజ్‌, మ‌రోవైపు బుచ్చిబాబు సానా మోస్ట్ వాంటెడ్ ఫెలోస్ అయ్యారు ఇప్పుడు టాలీవుడ్‌కి.
    Published by:Anil
    First published: