మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన అనే టైటిల్‌తో తెలుగు చిత్రసీమకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ లుక్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. వైష్ణవ్ తేజ్ మరో సినిమాకు కూడా ఓకే చేశాడు. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఓ బేబీకి దర్శకత్వం వహించిన నందిని రెడ్డితో వైష్ణవ్ కొత్త సినిమా ఉండనుంది. నందిని రెడ్డి ‘ఓ బేబీ’ చిత్రీకరణ సమయంలోనే వైజయంతి అనుబంధ సంస్ధ అయిన స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. నందిని రెడ్డి ప్రస్తుతం హిందీ లస్ట్ స్టోరీస్‌ను తెలుగులో రీమేక్ చేసే పనిలో ఉంది. లస్ట్ స్టోరీస్‌లో ఆమె ఓ ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తన చేయాల్సిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తైంది. దీంతో ఇక ప్రస్తుతం నందిని రెడ్డి, వైష్ణవ్ తేజ్‌తో తన సినిమా స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తోంది. ఈ తాజా చిత్రం ప్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రియాంక దత్ నిర్మించనున్నారు. ‘మహానటి' సినిమాకు సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అదించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Movie News