హోమ్ /వార్తలు /సినిమా /

Vaishnav Tej: ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై మరో లెక్క! రంగరంగ వైభవంగా మెగా హీరో

Vaishnav Tej: ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై మరో లెక్క! రంగరంగ వైభవంగా మెగా హీరో

Ranga Ranga Vaibhavamgaa Trailer (Photo Twitter)

Ranga Ranga Vaibhavamgaa Trailer (Photo Twitter)

Ranga Ranga Vaibhavamga Trailer: రంగరంగ వైభవంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయిన నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Tollywoodఉప్పెన (Uppena) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ తేజ్ (Vaishnav Tej).. ఇప్పుడు రంగరంగ వైభవంగా (Ranga Ranga Vaibhavamga) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సారి మాస్ రోల్ తో ప్రేక్షకులను టచ్ చేయబోతున్నాడు. వైష్ణవ్ మూడో సినిమాగా ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయిన నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి (Ranga Ranga Vaibhavamga Trailer) సినిమాపై హైప్ పెంచేశారు. ఈ ట్రైలర్ లో చూపించిన ప్రతి సన్నివేశం కూడా సినిమా పట్ల ఆతృత పెంచేసేలా ఉంది.


ఫన్ అండ్ రొమాంటిక్‌గా సాగిన ఈ ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్ డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. నైట్ పాప ఒక్కతే ఉంటది అనే డైలాగ్ సినిమాలో రొమాంటిక్ డోస్ దండిగా ఉంటుందని చెబుతోంది. నానా ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై మరో లెక్క అంటూ చివరగా ఆయన చెప్పిన డైలాగ్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హాట్ బ్యూటీ కేతిక శర్మ (Kethika sharma) హీరోయిన్ గా నటించింది.


రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బాపినీడు బి సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించనుంది టీమ్. మరోవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులను (Aha )ఆహా స్ట్రీమింగ్ సంస్థ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఇది పోస్ట్- థియేట్రికల్ OTT బిజినెస్. సినిమా థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత OTTలో స్ట్రీమింగ్ కానుంది.' isDesktop="true" id="1417544" youtubeid="J8CvvGRTziQ" category="movies">


ఈ సినిమాలో నరేష్, ప్రభు, తులసి, శ్రీలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యూత్ ఆడియన్స్ నచ్చే, మెచ్చే సన్నివేశాలతో ఈ మూవీ రూపొందించారని ఇప్పటివరకు వదిలిన అన్ని అప్‌డేట్స్ కన్ఫర్మ్ చేశాయి. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ కెరీర్ మరో మెట్టు ఎక్కుతుందని మెగా అభిమానులు బలంగా నమ్ముతున్నారు.


ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా కొండపొలం (Kondapolam). ఈ చిత్రం 2021 అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో (Kondapolam on Amazon Prime) స్ట్రీమ్ అవుతోంది.

First published:

Tags: Tollywood, Tollywood actor, Vishnav tej

ఉత్తమ కథలు