ఉప్పెన (Uppena) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటించిన చిత్రం కొండపొలం. క్రిష్ (Krish) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. కరోనా సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. కొండ పొలం మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ (Rakulpreet singh) హీరోయిన్‌గా నటిస్తోంది. అన్నపూర్ణ, కోటా శ్రీనివాసరావు, రచ్చ రవి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన కొండపొలం నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయనే టాక్ వినిపిస్తోంది. అక్టోబరు 8న విడుదల కావాల్సిన ఈ కొండ పొలం మూవీ.. వివాదాల్లో చిక్కుకుంది. సినిమాలో హీరో పేరులో యాదవ్‌ను చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి. కురుమ/కురువల కులవృత్తి నేపథ్యంలో సినిమా తీసి యాదవ్ అని ఎలా పెడతారని కురవ సంఘాలు ప్రశ్నిస్తున్నారు.
సమంత-నాగచైతన్య విడాకుల గురించి ఐదేళ్ల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు
శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పాలమూరు కురవ సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పాలమూరు కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శంకరోళ్ల రవి కుమార్ మాట్లాడుతూ.. సినిమాలో హీరో పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సాయి పల్లవితో ఆ ముద్దు సీన్ కోసం ఆరు గంటల సమయం పట్టిందా..
'' కొండపొలం సినిమాలో మా కురుమ/ కురువ కులవృత్తి ఎదుర్కొంటున్న సమస్యలను బాగా చూపించారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ సినిమాలో హీరో పేరు కటారు రవీంద్ర యాదవ్ అని పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. యాదవులు అంటే గొర్రెలు, మేకలు కాకుండా గేదెలు, ఇతర పశువులు కాస్తారు. కురుమ, కురువలు మాత్రమే గొర్రెలు కాస్తారు. యాదవులు BC-Dలో కేటగిరీలలో ఉంటే, కురుమలు ఇంకా వెనకబడిన వర్గానికి చెంది BC-B కిందకు వస్తారు. మా పేరు చివర కురుమ అని పెట్టుకుంటాం. యాదవుల కుల దైవం మల్లన్న. కురుమల కుల దైవం బీరప్ప. కోటి మంది కురుమల మనోభావాలను దెబ్బతీసినట్లు హీరో పేరు ఉంది. ఒక సామాజిక వర్గం అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉంది. హీరో పేరును మార్చాలి. యాదవ్ అనే పదాన్ని తొలగించినా మాకు అభ్యంతరం లేదు. పేరు మార్చకుండా సినిమా విడుదల చేస్తే మా నిరసన తెలియజేస్తాం. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఆందోళన చేస్తాం.'' అని శంకరోళ్ల రవి కుమార్ తెలిపారు.
డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. అరెస్ట్ అనివార్యం..
కాగా, కొండపొలం సినిమా దర్శకుడు క్రిష్.. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో హరిహర వీరమల్లు మూవీని కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఐతే అది భారీ బడ్జెట్ సినిమా. పాన్ ఇండియా మూవీగా చిత్రీకరిస్తున్నారు. హరిహర హర వీరమల్లు సినిమా తర్వాతే కొండపొలం తీయాలని అనుకున్నారు. కానీ అది పూర్తయ్యే సరికి చాలా సమయం పట్టవచ్చని భావించిన క్రిష్.. పవన్, ఏఎం రత్నం అనుమతితో సినిమాకు బ్రేక్ ఇచ్చారు. ఆ గ్యాప్‌లో కొండపొలం చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ మూవీని చేసుకునేందుకు సహకరించిన పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు అని మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పారు క్రిష్. పవన్ కల్యాణ్ అనుమతించకపోయినా.. ఏఎం రత్నం అంగీకరించకపోయినా.. ఇంద్రగంటి, సుకుమార్ కొండపొలం నవలను నాకు పరిచయం చేయకపోయినా.. సన్నపురెడ్డి వెంకటరెడ్డి నవలను రాయకపోయినా.. ఈ చిత్రం వచ్చేది కాదని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kondapolam, Rakul Preet Singh, Tollywood, Vaishnav tej