Home /News /movies /

VAISHNAV TEJ RAKUL PREET STARER KONDAPOLAM DIRECTED BY KRISH TO HAVE AHA DIGITAL RELEASE HERE ARE THE DETAILS SR

Kondapolam OTT Release: కొండపొలం ఓటీటీ రిలీజ్.. ఆహాలో స్ట్రీమ్ కానున్న ఉప్పెన హీరో సెకండ్ ఫిల్మ్..

Vaishnav Rakul and Krish Photo : Twitter

Vaishnav Rakul and Krish Photo : Twitter

Kondapolam OTT Release: వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా కొండపొలం ఓటీటీ‌లో రిలీజ్ కానుందా.. అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

    Kondapolam OTT Release : దర్శకుడు క్రిష్, రకుల్ ప్రీత్, వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో ఇంట్రెస్టింట్ పాయింట్‌తో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా అధికారికంగా టైటిల్‌ను ప్రకటించలేదు. కానీ దాదాపు కొండపొలంగా చిత్రబృందం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈసినిమా షూటింగ్ పోయిన సంవత్సరమే పూర్తి అయింది. అంతేకాదు సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీంతో సినిమాను విడుదల చేద్దాం అంటే కరోనా కారణంగా అది వీలయ్యే పని కాదు. దీంతో చిత్రబృందం ఓటీటీ వైపు చూస్తోందని టాక్. తెలుగు స్ట్రీమింగ్ సంస్థ ఆహాలో ఈ సినిమా డిటిటల్ రిలీజ్ కానుందని తాజా సమాచారం. ఆహా భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 15 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.  దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ రిలీజ్ అసాధ్యం కాబట్టి ఓటీటీకి మొగ్గు చూపుతున్నారట దర్శక నిర్మాతలు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఇక ఈ సినిమాకు కొండ పొలం అనే టైటిల్‌‌తో జంగిల్ బుక్ అనే మరో టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

    ఇక వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే.. ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ భారీ హిట్‌ను అందుకున్నారు. దీంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్. నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు.. మరి సినిమాలో కథ ఎలా ఉండనుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసిందని టాక్. క్రిష్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్‌కు కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు