మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేశాడు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కొండపొలం (Kondapolam) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఈరోజు ట్రైలర్ విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్లకు .. లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిన.. నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఈ నెల 27వ తేదీ సోమవారం రోజున అంటే మధ్యాహ్నం 3:33 నిమిషాలకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. దీంతో అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని తెలిసిందే. దీనికి సంబంధించి చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.
ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్.
Get Ready for @panja_vaishnav_tej @Rakulpreet #KondaPolam "An Epic Tale of Becoming"
Releasing #KondaPolamTrailer on Monday (27 Sep) 3:33 PM#KondaPolamOct8 ?@mmkeeravaani @gnanashekarvs #Sannapureddy @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/7oKm7TYClw
— Krish Jagarlamudi (@DirKrish) September 25, 2021
ఇక ఈ నవల కొండపొలం (Kondapolam) విషయానికి వస్తే.. నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు.
Rana Daggubati : రానా దగ్గుబాటి కొత్త అవతారం.. ఆ సినిమా కోసం తప్పట్లేదు..
బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు.. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది.
40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్..
ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీంతో సినిమాను విడుదల చేద్దాం అంటే కరోనా వచ్చింది. క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది. ఆ మధ్య ఈ సినిమా నుండి విడుదలైన పాటకు మంచి ఆదరణ వచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో పాటు ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో పలు సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదలచేయాలనీ భావించారు చిత్ర దర్శక నిర్మాతలు.
Karthika Deepam : బుల్లెట్ బండి ఎక్కిన అందాల అత్తమ్మ... అదరగొట్టిన అర్చన అనంత్...
కాగా ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా వాయిదా పడనుందని టాక్. దీనికి కారణం అఖిల్ సినిమానే అంటున్నారు. ఇదే రోజున రెండు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. ఇందులో మొదటిది అక్కినేని అఖిల్ (Akhil Akkineni) నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (most eligible bachelor) కాగా, రెండోది మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం. అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా కోసం కొండపొలం మూవీని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను దసరా బరి నుంచి తప్పించి నవంబర్‌లో విడుదల చేయాలని చిత్రదర్శక నిర్మాతలు భావిస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన దర్శకుడు గీరిషయ్య డైరెక్షన్లో ఓ సినిమాను చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్గా చేస్తోంది. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kondapolam, Rakul Preet Singh, Vaishnav tej