హోమ్ /వార్తలు /సినిమా /

Kondapolam : యూట్యూబ్‌లో అదరగొడుతోన్న వైష్ణవ్ తేజ్ కొండపొలం ట్రైలర్..

Kondapolam : యూట్యూబ్‌లో అదరగొడుతోన్న వైష్ణవ్ తేజ్ కొండపొలం ట్రైలర్..

Kondapolam Trailer Photo : Twitter

Kondapolam Trailer Photo : Twitter

Kondapolam : మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తాజా ‘కొండపొలం’. ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతోంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అది అలా ఉంటే ఆయన తన తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేశారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కొండపొలం (Kondapolam) అనే టైటిల్‌‌ను ఖరారు చేశారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ నెల 27వ తేదీ సోమవారం రోజున అంటే మధ్యాహ్నం 3:33 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదలై అదరగొడుతోంది. యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ కేకపెట్టిస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ ఆరు మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంటూ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పులితో సీన్స్, రకుల్‌తో రొమాన్స్, విజువల్స్ నెటిజన్స్‌‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్.

"An Epic Journey" #KondaPolamTrailer Strikes 6️⃣M+ Views ? & Trending No.1️⃣ on @YouTubeIndia??.


▶️ https://t.co/hjpEdbtAXJ#KondaPolam #KondaPolamOct8#PanjaVaisshnavTej @Rakulpreet @DirKrish @mmkeeravaani @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/DVNfMXYYYm

— BA Raju's Team (@baraju_SuperHit) September 28, 2021

ఇక ఈ నవల కొండపొలం (Kondapolam) విషయానికి వస్తే.. నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు.

బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి.. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది.

Akhil Akkineni : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్..

క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది. ఆ మధ్య ఈ సినిమా నుండి విడుదలైన పాటకు మంచి ఆదరణ వచ్చింది.

ఇక వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన దర్శకుడు గీరిషయ్య డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. భోగవల్లి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

First published:

Tags: Kondapolam, Rakul Preet Singh, Tollywood news, Vaishnav tej

ఉత్తమ కథలు