మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆయన తన తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే తన నెక్స్ట్ సినిమా కొండపొలం కూడా పూర్తి చేశారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొండపొలం టీమ్ బిగ్ బాస్ వేదికపై అలరించనుంది. ప్రస్తుతం బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం సీజన్ 5 జరుపుకుంటోంది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ 19 మంది సభ్యులతో మొదలవ్వగా.. ఈ షో నుండి నలుగురు సభ్యులు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌజ్‌లో 16 మంది సభ్యులు ఉన్నారు.
మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతున్న ఈ షోలో కొండ పొలం టీం సందడి చేయనుంది. హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు క్రిష్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ వేదికపై నాగార్జునతో కలిసి అలరించనున్నారు. వైష్ణవ్ ఇంత చిన్న వయస్సులోనే రకుల్‌ని ప్రేమించావా అంటూ నాగార్జున అడగ‌్గా.., వైష్ణవ్ చేయాల్సి వచ్చిందని బదులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Weekend fun starts with #Kondapolam team visit and housemates ki encounters!#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun @dirkrish pic.twitter.com/Hhve2eqdJa
— starmaa (@StarMaa) October 9, 2021
ఇక కొండ పొలం సినిమా విషయానికి వస్తే.. అడవి నేపథ్యంలో పూర్తి అడ్వెంచర్స్ చిత్రంగా రూపొందింది. ఇందులో రకుల్ పూర్తి గ్రామీణ యువతిగా, గొర్రెలు కాచుకొనే ‘ఓబులమ్మ’గా నటించగా.. వైష్ణవ్ తేజ్ ‘కటారు రవీంద్ర యాదవ్’ అనే పాత్రలో కనిపించి అలరించారు.
ఇక కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది. ఆ మధ్య ఈ సినిమా నుండి విడుదలైన పాటకు మంచి ఆదరణ వచ్చింది.
ఇక వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన దర్శకుడు గీరిషయ్య డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.