హోమ్ /వార్తలు /సినిమా /

Kondapolam : వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ కొండపొలం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే..

Kondapolam : వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ కొండపొలం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే..

తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు.. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Instagram

తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు.. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Instagram

Kondapolam : మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తాజా ‘కొండపొలం’. ఈ సినిమా అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే తన నెక్స్ట్ సినిమాకొండపొలం (Kondapolam) కూడా పూర్తి చేశారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే... బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు నైజాంలో 30 లక్షలకు పైగా షేర్‌ని సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో సినిమా 1.1 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.

ఏరియాల వారిగా కలెక్షన్స్…

Nizam: 32L

Ceeded: 11L

UA: 30L(12L Hires)

East: 12L

West: 11L

Guntur: 21.2L(12L Hires)

Krishna: 10L

Nellore: 7L

AP-TG Total:- 1.34CR(1.95CR Gross)

Ka+ROI: 5L

OS – 7L

Total WW: 1.46CR(2.20CR Gross)

Love Story : లవ్ స్టోరి 15 డేస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని.. లాభాల బాటలో...

ఈ సినిమాను 7.5 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ సినిమా ఇంకా 6.54 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

ఇక కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసింది.

Vaishnav Tej : రకుల్‌ను ప్రేమించాల్సి వచ్చింది.. నాగార్జున సాక్షిగా ఒప్పుకున్న వైష్ణవ్ తేజ్...

క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది. ఆ మధ్య ఈ సినిమా నుండి విడుదలైన పాటకు మంచి ఆదరణ వచ్చింది.

ఇక వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన దర్శకుడు గీరిషయ్య డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. భోగవల్లి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

First published:

Tags: Kondapolam, Rakul Preet Singh, Tollywood news, Vaishnav tej

ఉత్తమ కథలు