హోమ్ /వార్తలు /సినిమా /

Kondapolam : ఓటీటీలో వైష్ణవ్ తేజ్ కొండపొలం.. ఈరోజు నుంచి స్ట్రీమింగ్..

Kondapolam : ఓటీటీలో వైష్ణవ్ తేజ్ కొండపొలం.. ఈరోజు నుంచి స్ట్రీమింగ్..

Kondapolam on Amazon prime Photo : Twitter

Kondapolam on Amazon prime Photo : Twitter

Kondapolam : ఈ చిత్రం అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించింది. ఎప్పుడో థియేటర్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌లో (Kondapolam on Amazon Prime) స్ట్రీమ్ అవుతోంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఉప్పెన తర్వాత ఆయన తాజాగా నటించిన సినిమా కొండపొలం (Kondapolam). ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించింది. ఎప్పుడో థియేటర్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌లో (Kondapolam on Amazon Prime) స్ట్రీమ్ అవుతోంది. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా చేసింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. క్రిష్‌ దర్శకత్వం వహించారు. కొండపొలంకు కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో కోట శ్రీనివాసరావు, సాయిచంద్‌, హేమ, రచ్చ రవి కీలకపాత్రల్లో నటించారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ర‌వీంద్ర‌నాథ్ గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తి. బిటెక్ చేసిన రవి ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వస్తాడు. ఎంత ప్ర‌య‌త్నించినా రవి ఉద్యోగం రాదు. దీంతో తన సొంత ఊరికి చేరుతాడు.

Samantha Ruth Prabhu : సమంత అభిమానులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న శుభ ముహూర్తం..

ఇక తన తండ్రితో పాటు గొర్రెల్ని మేప‌డం కోసం కొండ‌పొలానికి వెళ‌్లడం అక్కడ ఏం జరిగింది. రకుల్ పాత్ర ఏమిటీ. రవి ఐ.ఎఫ్‌.ఎస్‌ ఎలా ఎంపిక అయ్యాడు అనేవి కథలో ముఖ్యాంశాలు. ఈ సినిమాలో (Rakul Preet Singh) రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసింది.


Ileana : తడిసిన అందాలతో.. చలికాలంలో హీటు పెంచుతోన్న ఇలియానా..

క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఇక వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన దర్శకుడు గీరిషయ్య డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. భోగవల్లి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

First published:

Tags: Amazon prime, Kondapolam, Rakul Preet Singh, Tollywood news, Vaishnav tej

ఉత్తమ కథలు