• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VAISHNAV TEJ MOVIE WITH JATHI RATHNALU FAME ANUDEEP MHN

Vaishnav Tej - Anudeep: ‘ఉప్పెన’ హీరోతో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ మూవీ.. చిరు ఏమంటారో..?

Vaishnav Tej - Anudeep: ‘ఉప్పెన’ హీరోతో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ మూవీ.. చిరు ఏమంటారో..?

Vaishnav Tej movie with Jathi Rathnalu fame Anudeep

Vaishnav Tej - Anudeep: రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్స్ అయిన ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్, జాతి రత్నాలు చిత్రంతో సక్సెస్ కొట్టిన దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ఏదైనా ఒక్క సినిమా హిట్టయితే చాలు ఇక ఆ సినిమాలో నటించిన హీరోకు గానీ... హీరోయిన్‌కు గానీ వరుస ఆఫర్లు వచ్చి పడుతుంటాయ్. ‘మేం సినిమా తీస్తాం’ అని నిర్మాణ సంస్థలు, మా దగ్గర కథ రెడీగా ఉంది సార్.. మీరు ఓకే అంటే పట్టాలెక్కించేద్దాం అని దర్శకులు తెగ క్యూ కట్టేస్తుంటారు. ఇందుకు ప్రత్యేకించి ఉదాహరణలేమీ చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయ్. అలా ఒక్క సినిమాతో ఇప్పుడు స్టార్ హీరోలుగా.. స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవాళ్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఇలాగే మెగా మేనల్లుడు, ‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్‌ కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్నారట. ఇంతకీ ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

    ‘ఉప్పెన’ సినిమాతో ఎవరూ ఊహించని రీతిలో సూపర్ డూపర్ హిట్‌ను వైష్ణవ్ తేజ్‌ అందుకున్నాడు. ఫస్ట్ సినిమానే బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో ఇక ఆయనకు వెనక్కితిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాదు.. మెగా హీరోల్లో ఈ కుర్ర హీరోకు కూడా గుర్తింపు వచ్చేసింది. ఎంట్రీతోనే ఎక్కడికో అందనంత ఎత్తుకు చేరిపోయిన ఈ కుర్ర హీరో కోసం ఇప్పుడు సినిమాలు చేస్తామని ఇప్పటికే ఒకరిద్దరు దర్శకులు సంప్రదించారని వార్తలు వినిపించిన విషయం విదితమే. అయితే తాజాగా.. ‘జాతిరత్నాలు’ మూవీ దర్శకుడు కెవి అనుదీప్ ఓ సినిమా తెరకెక్కించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    ఇప్పటికే తేజ్‌కు అదిరిపోయే కథ వినిపించగా.. మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి కథ చెప్పి ఒప్పించాలని అనుదీప్‌కు చెప్పాడట. తేజ్‌కు మాత్రం కథ నచ్చిందట. ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్నాడు. ఆయన కథ విని.. అంతా ఓకే అనుకుంటే సినిమా ఉంటుందన్న మాట. ‘ఉప్పెన ’ సినిమా కథ కూడా చిరు విన్న తర్వాత తేజ్ కూడా ఓకే చేశాడని స్వయంగా హీరోనే చెప్పాడు. అందుకే ప్రతి కథ మామయ్యకు వినిపించి.. ఓకే చెప్పిన తర్వాతే ముందుకెళ్తానని తేజ్ చెప్పడంతో చిరు అపాయిట్మెంట్ కోసం అనుదీప్ వెయిట్ చేస్తున్నాడట. ఈ సినిమా ఓకే అనుకుంటే.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. కాగా.. అనుదీప్ తెరకెక్కించిన ‘జాతిరత్నాలు’ సినిమా బాక్సాఫీస్‌ను విషయం విదితమే. దర్శకుడిగా ఇంత మంచి గుర్తింపు తెచ్చుకున్న కుర్ర దర్శకుడికి చిరు ఏం చెబుతారో ఏంటో మరి.
    Published by:Anil
    First published: