Vaishnav Tej: ఉప్పెన మూవీతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు మెగా హీరో వైష్ణవ్ తేజ్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వైష్ణవ్‌కు మొదటి చిత్రమే అయినప్పటికీ.. నటనలో పరిణతి చూపించాడు. ఇక ఈ మూవీ తరువాత వైష్ణవ్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ ఓ చిత్రంలో నటించగా.. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు నాగార్జున కూడా వైష్ణవ్‌తో ఒక సినిమాకు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ హీరో మరో దర్శకుడికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఆదిత్య వర్మ(అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్) ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన గిరీషయ్య దర్శకత్వంలో వైష్ణవ్ ఓ మూవీకి ఓకే చెప్పారట.
సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన గిరీషయ్య ఆదిత్య వర్మతో దర్శకుడిగా మారాడు. ఇక ఈ దర్శకుడు ఇటీవల వైష్ణవ్‌కి ఒక కథ చెప్పడం, ఆ హీరో ఓకే చెప్పడం జరిగిపోయానని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనుండగా.. ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ మూవీ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సనకు కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అందులో తన శిష్యుడు సుకుమార్‌ను ఫస్ట్ రైడ్‌కి తీసుకెళ్లాడు బుచ్చిబాబు. ఇక ఈ దర్శకుడు తన రెండో సినిమాను కూడా మైత్రీ నిర్మాణ సంస్థలోనే చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Vaishnav tej