హోమ్ /వార్తలు /సినిమా /

Vaishnav Tej : అక్కినేని అఖిల్ కోసం ఏ హీరో చేయని త్యాగం చేసిన వైష్ణవ్ తేజ్..

Vaishnav Tej : అక్కినేని అఖిల్ కోసం ఏ హీరో చేయని త్యాగం చేసిన వైష్ణవ్ తేజ్..

Vaishnav Tej and Akhil Photo : Twitter

Vaishnav Tej and Akhil Photo : Twitter

Vaishnav Tej : కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవడంతో ప్రతి వారం వరుసగా సినిమాలు విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అక్టోబర్ 8న కూడా తెలుగులో రెండు మీడియం రేంజ్ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇందులో మొదటిది అక్కినేని అఖిల్ (Akhil Akkineni) నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (most eligible bachelor) అవ్వగా, రెండోది మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన (Kondapolam) కొండపొలం.

ఇంకా చదవండి ...

  మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేశాడు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కొండపొలం (Kondapolam) అనే టైటిల్‌‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్. ఇక ఈ నవల కొండపొలం (Kondapolam) విషయానికి వస్తే.. నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు.

  బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు.. మరి సినిమాలో కథ ఎలా ఉండనుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది.

  Maha Samudram Trailer : మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా.. రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోన్న మహా సముద్రం ట్రైలర్..

  ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీంతో సినిమాను విడుదల చేద్దాం అంటే కరోనా వచ్చింది. క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుండి విడుదలైన పాటకు మంచి ఆదరణ వచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో పాటు ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో పలు సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదలచేయాలనీ భావించారు చిత్ర దర్శక నిర్మాతలు.

  Love Story Twitter Review : లవ్‌స్టోరి ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

  కొండపొలం వాయిదా..

  అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా పడనుందని టాక్. దీనికి కారణం అఖిల్ సినిమానే అంటున్నారు. ఇదే రోజున రెండు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. ఇందులో మొదటిది అక్కినేని అఖిల్ (Akhil Akkineni) నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (most eligible bachelor) కాగా, రెండోది మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం. అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా కోసం కొండపొలం మూవీని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను దసరా బరి నుంచి తప్పించి నవంబర్‌లో విడుదల చేయాలని చిత్రదర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

  ఇక వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన దర్శకుడు గీరిషయ్య డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. భోగవల్లి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Akhil Akkineni, Kondapolam, Tollywood news, Vaishnav tej

  ఉత్తమ కథలు