హోమ్ /వార్తలు /సినిమా /

RangaRanga Vaibhavanga Movie Review: వైష్ణవ్ తేజ్ ’రంగరంగ వైభవంగా’ మూవీ రివ్యూ..

రంగరంగ వైభవంగా..
రంగరంగ వైభవంగా..
2/5
రిలీజ్ తేదీ:2/9/2022
దర్శకుడు : గిరీశయ్య
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
నటీనటులు : వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నరేష్, ఆలీ, ప్రభు, నవీన్ చంద్ర తదితరులు..
సినిమా శైలి : రొటీన్ ఫ్యామిలీ డ్రామా..
సినిమా నిడివి : 2Hr 30M

RangaRanga Vaibhavanga Movie Review: వైష్ణవ్ తేజ్ ’రంగరంగ వైభవంగా’ మూవీ రివ్యూ..

రంగరంగ వైభవంగా మూవీ రివ్యూ (Twitter/Photo)

రంగరంగ వైభవంగా మూవీ రివ్యూ (Twitter/Photo)

Ranga Ranga Vaibhavanga Movie Review: మెగా వారసుడిగా ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత ‘కొండపొలం’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. తాజాగా ఈయన గిరీషయ్య దర్శకత్వంలో ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో పలకరించాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ హిట్ అందుకున్నాడా ? లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : రంగరంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga)

నటీనటులు : వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నరేష్, ఆలీ, ప్రభు, నవీన్ చంద్ర తదితరులు..

ఎడిటర్: కోటగిరి వేంకటేశ్వరరావు

సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్ సైనూద్దీన్

సంగీతం: దేవీశ్రీ ప్రసాద్

నిర్మాత : బివియస్ఎన్ ప్రసాద్

దర్శకత్వం: గిరీశయ్య

విడుదల తేది : 2/9/2022

మెగా వారసుడిగా ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత ‘కొండపొలం’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. తాజాగా ఈయన గిరీషయ్య దర్శకత్వంలో ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో పలకరించాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ హిట్ అందుకున్నాడా ? లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

చంటి (నరేష్), రాముడు (ప్రభు) మంచి దోస్తులు. వాళ్ల పిల్లలైన రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతిక శర్మ) వీళ్లిద్దరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఖుషీ తరహాలో వీళ్లిద్దరు ఒకే రోజు పుడతారు. ఈ రెండు కుటుంబాలు ఏదో కొన్ని అపార్ధాల కారణంగా విడిపోతారు. చివరకు హీరో, హీరోయిన్లు వాళ్ల కుటుంబాలను ఏకం చేసారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారా అనేదే ‘రంగ రంగ వైభవంగా’ సినిమా స్టోరీ.

కథనం, టెక్నీకల్ విషయానికొస్తే..

‘రంగ రంగ వైభవంగా’ సినిమా స్టోరీ ‘నిన్నే పెళ్లాడతా’ సీన్‌తో స్టార్ట్ అవుతోంది. దీంతో తాను ఎలాంటి సినిమాను తీయబోతున్నానో సింబాలిక్‌గా చెప్పకనే చెప్పాడు. మొత్తంగా ఈ సినిమా స్టోరీని గతంలో మనం చూసిన నిన్నేపెళ్లాడతా, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, తరహాలో రాసుకున్నాడు. ఆల్రెడీ ఇలాంటి కథలతోనే సీరియల్స్ తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి స్టోరీలతోనే ఏళ్ల కేళ్లు సీరియల్స్ లాగించేస్తున్నారు. ఇపుడు ఆ తరహా కథతోనే ప్రేక్షకులకు ముందు రావడం పెద్ద జోక్ అని చెప్పాలి. ఆల్రెడీ ఎపుడో ఔట్ డేడెట్ కథతో ఇపుడు దర్శకుడు కొత్తగా ఏం చెప్పదలుచుకున్నాడో అతనికే తెలియాలి.పైగా ఇలాంటి రొటిన్ ప్రేమ కథలకు స్క్రీన్ ప్లే‌తో పాటు కామెడీ కూడా వర్కౌట్ కావాలి. ఫస్టాఫ్ బాగానే ఉన్నా.. సెకండాఫ్‌లో తప్పటడుగులు వేసాడు దర్శకుడు.  మొత్తంగా రెండు ఫ్యామిలీల మధ్య ఏదో చిన్న కారణంతో గొడవలనేవి ఎప్పటి నుంచో చూస్తున్నవే అనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా చూస్తుంటే.. దర్శకుడు చాలా సినిమాల నుంచి సీన్స్ లేపట్టి ఈ సినిమాను రెడీ చేసాడా అనే డౌట్స్ కూడా వస్తాయి. ఉన్నంతలో పాటలను అందంగా చిత్రీకరించాడు దర్శకుడు గిరీషయ్య.

రంగ రంగ వైభవంగా సినిమాకు దేవీశ్రీ పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఉన్నంతలో దేవీశ్రీ సంగీతం పెద్ద ఊరట. పాటలు బాగున్నాయి. శ్యామ్‌దన్ సైనూద్దీన్ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్‌ ఇంకాస్తా ట్రిమ్ చేస్తే బాగుండేది. మొత్తంగా ఈ సినిమా చూస్తుంటే.. పాత సినిమాలను చూసిన జ్క్షాపకం వస్తోంది.

నటీనటుల విషయానికొస్తే.. 

వైష్ణవ్ తేజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు.ఉప్పెన, కొండపొలంతో పోల్చితే యాక్టర్‌గా రాటుదేలాడనే చెప్పాలి. సెంటిమెంట్ సీన్స్‌లో పండించాడు. డాన్స్ విషయంలో ఇంకా మెరుగు కావాలి. చాలా సన్నివేశాల్లో చిరు, పవన్‌ల మేనరిజమ్స్‌ చూపించాడు. కేతిక శర్మ గ్లామర్‌గానే కాకుండా.. నటనతో పర్వాలేదనిపించింది. ఇక ప్రభు, నరేష్‌ల నటన గురించి కొత్తగా చెప్పాల్పిన పనిలేదు. ఆలీ, నవీన్ చంద్ర ఉన్నంతలో తమ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ 

వైష్ణవ్ తేజ్ నటన

కేతిక శర్మ గ్లామర్

దేవీశ్రీ సంగీతం

మైనస్ పాయింట్స్ 

రొటీన్ కథ,

స్క్రీన్ ప్లే

సెకండాఫ్

చివరి మాట : రంగరంగ వైభవంగా.. అంతంత మాత్రమే

రేటింగ్ : 2/5

Published by:Kiran Kumar Thanjavur
First published:

రేటింగ్

కథ:
2/5
స్క్రీన్ ప్లే:
2/5
దర్శకత్వం:
2/5
సంగీతం:
2.5/5

Tags: Ranga Ranga Vaibhavanga, Tollywood, Vaishnav tej

ఉత్తమ కథలు