VAISHNAV TEJ KETIKA SHARMA NEW MOVIE DIRECTED BY GIREESAAYA TITLE AND TEASER RELEASED TOMORROW TA
Vaishnav Tej : వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం టైటిల్ మరియు టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..
వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం టైటిల్ టీజర్ పై బిగ్ అప్టేట్ (File/Photo)
Vaishnav Tej : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈయన నటిస్తోన్న మూడో సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఈ సోమవారం రివీల్ చేయనున్నారు.
Vaishnav Tej : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఉప్పెన తర్వాత ఆయన తాజాగా నటించిన సినిమా కొండపొలం (Kondapolam). ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. కానీ ఓటీటీతో పాటు తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌లో ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయి. ఈ రెండు సినిమాల తర్వాత వైష్ణవ్ గిరీషయ్య అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తో పాటు టీజర్‌ను రేపు (సోమవారం) 11 గంటలకు ప్రకటించనున్నారు. ఇక అది అలా ఉంటే వైష్ణవ్ మరో సినిమాను ఓకే చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ దర్శకుడు గిరీషయ్య తో ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
మరోవైపు వైష్ణవ్ తేజ్ హీరోగా ‘జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. కేవీ అనుదీప్.. గతంలో పిట్టగోడ అనే ఓ ఒక చిన్న సినిమా తీశాడు. ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయినా ఇండస్ట్రీ వర్గాలలో మాత్రం దర్శకుడు అనుదీప్‌లో సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఆ సినిమా వచ్చిన ఐదు సంవత్సరాలకు జాతిరత్నాలు వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ముందుకు వచ్చాడు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు. ఆయన మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం నుంచి రీసెంట్గా వచ్చిన జాతి రత్నాలు సినిమా వరకు అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.
నాగ్ అశ్విన్ ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్ నిర్మించాడు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో అదరగొడుతోంది. పెద్ద పెద్ద సినిమాలు కూడా కుదేలు అవుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే మాస్టర్ లాంటీ సినిమాల కలెక్షన్స్‌కు కూడా తుడిచిపెట్టేసింది జాతిరత్నాలు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 40 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి అందరీని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో దర్శకుడు అనుదీద్కి ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. అందులో భాగంగా ఉప్పెన సినిమాతో భారీ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్, అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే అన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.