Young Tiger Ntr - Uppena: మెగా హీరో సినిమాకు సపోర్ట్‌ చేస్తున్న యంగ్‌ టైగర్ ఎన్టీఆర్

Vaishnav Tej Debut Uppena Theatrical trailer releasing by Young Tiger Ntr

Young Tiger Ntr - Uppena: 'ఉప్పెన' సినిమా ట్రైలర్‌ను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ విడుదల చేస్తుండటం విశేషం. ట్రెండ్‌ను ఫాలో అవుతూ అందరితో స్నేహంగా ఉండే యంగ్‌ టైగర్.. వైష్ణవ్‌తేజ సినిమాకు సపోర్ట్‌ చేయడానికి రెడీ అయాడు.

  • Share this:
    నేటి తరం హీరోల మధ్య ఇటు వ్యక్తిగతంగానూ, అటు వృత్తిపరంగానూ మంచి అనుబంధాలు కొనసాగుతున్నాయి. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మల్టీస్టారర్‌ సినిమాల్లోనూ నటిస్తున్నారు. తొంబైవ దశకంలోని పరిస్థితులు ప్రస్తుతం కనపడటం లేదు. తాజాగా ఇందులో మరో ఉదాహరణ దొరికింది. అదేంటటే.. మెగా క్యాంప్‌ హీరో అయిన వైష్ణవ్‌ తేజ్‌ సినిమా ఉప్పెనకు నందమూరి హీరో.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సపోర్ట్‌ చేయడానికి ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే..వైష్ణవ్‌తేజ్‌ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై రూపొందిన ఉప్పెన చిత్రం ఫిబ్రవరి 12న విడుదలవుతుంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసిందట.

    ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ విడుదల చేస్తుండటం విశేషం. ట్రెండ్‌ను ఫాలో అవుతూ అందరితో స్నేహంగా ఉండే యంగ్‌ టైగర్.. వైష్ణవ్‌తేజ సినిమాకు సపోర్ట్‌ చేయడానికి రెడీ అయాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌తో ఉన్న సత్సంబంధాలు కూడా ఉప్పెన ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ విడుదల చేయడానికి కారణంగా కనిపిస్తున్నాయి. రాక్‌స్టార్‌ దేవిశ్రీ సార్‌థ్యంలో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే టీజర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ ఎలా ఆకట్టుకునుందో చూడాలి.

    డబ్బున్న అమ్మాయి, బెస్త కుర్రాడికి మధ్య నడిచే ప్రేమకథా చిత్రమిది. క్రితిశెట్టి హీరోయిన్‌గా నటించింది. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ఇందులో విలన్‌గా నటించడం విశేషం. ఆయన పాత్రను ఎలా ఎలివేట్‌ చేశారనేది ఆసక్తికరంగా మారింది. పాటలతో మెప్పించిన ఉప్పెన సినిమా రూపంలో ఎలా మెప్పిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 12 వరకు ఆగాల్సిందే.
    Published by:Anil
    First published: