ట్విట్టర్‌ ట్రెండింగ్స్‌లో నరేంద్రమోదీని బీట్ చేసిన నేసమణి.. ఇంతకీ అతనెవరో తెలుసా..

ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. మరికాసేట్లో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశం మొత్తానికి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం హైలెట్ కావాలి. కానీ ట్విట్టర్‌లో మాత్రం #prayfornesamani,అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్స్‌లో టాప్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఎవరీ నేసమణి.

news18-telugu
Updated: May 30, 2019, 4:42 PM IST
ట్విట్టర్‌ ట్రెండింగ్స్‌లో నరేంద్రమోదీని బీట్ చేసిన నేసమణి.. ఇంతకీ అతనెవరో తెలుసా..
మోదీ సర్కార్ 2.0 వర్సెస్ నేసమణి
  • Share this:
ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. మరికాసేట్లో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశం మొత్తానికి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం హైలెట్ కావాలి. కానీ ట్విట్టర్‌లో మాత్రం #prayfornesamani,అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్స్‌లో టాప్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఎవరీ నేసమణి. ఎందుకు ఈ పేరు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ వివరాలు తెలియాలంటే 2001లో తమిళ్‌లో వచ్చిన ‘ఫ్రెండ్స్’ చిత్రాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ సినిమాను తెలుగులో నాగార్జున,సుమంత్ హీరోగా ‘స్నేహమంటే ఇదేరా’ పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. తమిళంలో హిట్టైయిన ఈ మూవీ తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇక తమిళ్‌లో వడివేలు చేసిన క్యారెక్టర్‌ను తెలుగులో బ్రహ్మానందం చేసారు. ఇపుడు వడివేలు గురించి ఎందుకంటే .. పాకిస్థాన్‌కు చెందిన కొందరు సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సామాజిక మాధ్యమాల్లో సుత్తి ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఈ పరికరాన్ని మీ దేశంలో ఏమంటారు ? అని ప్రశ్న వేశారు.ఈ మీమ్ చేసిన వడివేలు ఫ్యాన్స్ కొందరు.. ‘ఫ్రెండ్స్’ సినిమాలో వడివేలు సుత్తి దెబ్బ తగిలి మూర్చపోయిన ఒక సన్నివేశాన్ని పోస్ట్ చేశారు. ఈ సన్నివేశం చాలా ఫన్నిగా ఉంటుంది. ఐతే ఈ సన్నివేశం గురించి తెలియక చాలా మంది నెటిజన్లు నిజంగానే వడివేలు పడిపోయాడేమో అనుకొని #prayfornesamani అనే హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభించారు. ఈ హ్యాష్‌టాగ్‌కు సినీ నటులైన సిద్దార్ధ్,సమంతతో పాటు క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా తమదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో వడివేలు కార్టూన్ ఫోటో వైరల్ అవుతుండటం విశేషం. ట్విట్టర్‌లో ఈ హ్యాష్‌ట్యాగ్, ‘modi sarkar2’‘cm of andhra’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లను క్రాస్ చేసి దూసుకుపోతుంది.First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు