Home /News /movies /

VADINAMMA SERIAL BECAME SECOND HIGHEST RATINGS IN TELUGU TV SERIALS MK

వదినమ్మ సీరియల్‌లో ఇదే అసలైన ట్విస్ట్...

(Image: Hotstar)

(Image: Hotstar)

వదినమ్మ సీరియల్ విజయవంతంగా తెలుగులో 170కు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అన్నాదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ కథాంశం, ముందుగా తమిళంలో విజయవంతమైన పాండియన్ స్టోర్స్ నుంచి రీమేక్ చేస్తున్నారు.

కార్తీక దీపం తర్వాత తెలుగు నాట అత్యధికంగా చూస్తున్న మరో సీరియల్ వదినమ్మ. ఈ సీరియల్ కూడా మంచి ట్విస్టులతో నడుస్తోంది. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, యాక్టర్ సుజిత సూపర్ కాంబినేషన్‌తో ముందుకు వచ్చిన వదినమ్మ సీరియల్ విజయవంతంగా తెలుగులో 170కు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అన్నాదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ కథాంశం, ముందుగా తమిళంలో విజయవంతమైన పాండియన్ స్టోర్స్ నుంచి రీమేక్ చేస్తున్నారు. అయితే అక్కడ సూపర్ హిట్ గా నిలిచిన ఈ సీరియల్ తెలుగులో కూడా దాదాపు అదే ఆదరణతో నడుస్తోంది. తమిళంలో ఆ సీరియల్ దాదాపు 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం విశేషం. కాగా తెలుగులో ఈ సీరియల్ ఇంకా మొదటి సీజన్ లో ఉంటే...తమిళంలో మాత్రం అసలైన ట్విస్ట్ దగ్గరకు వచ్చేసింది.

వదినమ్మ మరుదులందరికీ పెళ్లిల్లు అవుతాయని అయితే కుటుంబపరంగా వచ్చే క్లాషెస్ వల్ల ఒక్కొక్కరూ వేరు కాపురాలు పెట్టుకున్నట్లు ప్రసారం అవుతోంది. మరి తెలుగులో కూడా ఈ కథను ఇలాగే కొనసాగిస్తారా...లేదా మార్పులేమైనా చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Hotstar, Telugu tv serials, Vadinamma

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు