VADINAMMA SERIAL ACTOR RAJESH DATTA WIFE COMPLAINTS AGAINST HIM OVER ILLICIT AFFAIR SU
Rajesh Datta: వివాదంలో వదినమ్మ సీరియల్ నటుడు రాజేష్.. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన భార్య.. అసలు ఏం జరిగిందంటే..
వదినమ్మ సీరియల్ నటుడు రాజేష్ దత్తా
ప్రముఖ సీరియల్ నటుడు రాజేష్ దత్తా వివాదంలో చిక్కుకున్నాడు. రాజేష్ వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని.. అతని భార్య పోలీసులను ఆశ్రయించింది.
తెలుగు టీవీ సీరియల్ నటుడు రాజేష్ దత్తా వివాదంలో చిక్కుకున్నాడు. రాజేష్‌పై అతని భార్య న్యాయ పోరాటం చేస్తోంది. అతడు వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకొని తనను హింసిస్తున్నాడని అతడి భార్య అరుణ అలియాస్ సాధన పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి కాలేదని చెప్పి.. ఇతర అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకునేవాడని తెలిపింది. వివరాలు.. రాజేష్ దత్తా ప్రస్తుతం వదినమ్మ, చంద్రలేఖ సీరియల్స్‌లో లీడ్ రోల్ చేస్తున్నాడు. గతంలో కర్తవ్యం, సుందరకాండ, మొగలిరేకులు, చక్రవాకం, రాధాకళ్యాణం, యువ, తూర్పు వెళ్లే రైలు వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. అయితే ఇప్పుడు రాజేష్‌పై అతడు భార్య న్యాయ పోరాటానికి దిగడం హాట్ టాపిక్‌గా మారింది.
ఎఫైర్స్ గురించి ప్రశ్నిస్తే రాజేష్ తనను ఇంటి నుంచి గెంటేశాడని అతని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై నిలదీస్తే.. నా ఇష్టం అంటూ సమాధానమిచ్చేవాడని తెలిపింది. కొన్నిసార్లు అమ్మాయిలను కూడా ఇంటికి తీసుకొచ్చేవాడని వాపోయింది. సాధన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘2015లో నాకు రాజేష్‌కు విజయవాడలో వివాహం జరిగింది. కట్నం కింద రూ. 15 లక్షలు, 10 తులాల బంగారం కూడా ఇవ్వడం జరిగింది. మూడు నెలల పాటు వివాహ జీవితం బాగానే సాగింది. ఆ తర్వాత వేధింపులు మొదలయ్యాయి. నన్ను చెన్నై తీసుకెళ్లాడు. రాజేష్ మాత్రం సీరియల్స్ పేరు చెప్పి హైదరాబాద్ వచ్చేవాడు.
హైదరాబాద్‌లో పెళ్లి కాలేదని చెప్పి వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకునేవాడు. ఈ విషయంపై ప్రశ్నించినందుకు నన్ను వేధింపులకు గురిచేశాడు. ఇంట్లో నుంచి కట్టుబట్టలతో గెంటేశాడు’ అని సాధన తెలిపింది. దీంతో తన తల్లిదండ్రులతో కలిసి జగద్గిరి గుట్ట పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపింది. అంతేకాకుండా రాజేష్ ఇంటి వద్ద బైఠాయించి తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.