హోమ్ /వార్తలు /సినిమా /

V the Movie: OTTలో నాని ‘V’.. క్రేజీ అనౌన్స్‌మెంట్..

V the Movie: OTTలో నాని ‘V’.. క్రేజీ అనౌన్స్‌మెంట్..

నాని వి సినిమా (nani v movie)

నాని వి సినిమా (nani v movie)

V The Movie: ఇప్పటి వరకు తెలుగులో భారీ సినిమాలు ఏవీ కూడా ఓటిటిలో విడుదల కాలేదు. చిన్నాచితకా సినిమాలు మినహా పెద్ద సినిమాలు అయితే అక్కడ రాలేదు.

ఇప్పటి వరకు తెలుగులో భారీ సినిమాలు ఏవీ కూడా ఓటిటిలో విడుదల కాలేదు. చిన్నాచితకా సినిమాలు మినహా పెద్ద సినిమాలు అయితే అక్కడ రాలేదు. థియేటర్స్ ఓపెన్ చేస్తారు.. మంచి రోజులు వస్తాయనే నమ్మకంతోనే నిర్మాతలు కనిపిస్తున్నారు. కానీ ఆ మంచి రోజులు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తుందే కానీ తగ్గడం లేదు. దాంతో ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకోవడం అనేది కలలో మాటే. అందుకే ఒక్కొక్కటిగా క్రేజీ సినిమాలు కూడా ఓటిటి విడుదలకు సిద్ధమవుతున్నాయి.

వి సినిమా పోస్టర్ (Nani V movie)
వి సినిమా పోస్టర్ (Nani V movie)

అందులో మొదటి అడుగు నాని వేస్తున్నాడు. ఈయన నటించిన 25వ సినిమా వి త్వరలోనే ఇంటికే రాబోతుంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతుందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీనికి కన్ఫర్మేషన్ వచ్చేసింది. తాజాగా వి బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ ఓ వీడియో చేసాడు నాని. అందులో హోమ్ థియేటర్‌లోనే కూర్చుని సినిమా చూస్తుంటాడు.. అంతలోనే అయిపోతుంది.. అయితే కానీ మళ్లీ చూస్తా.. మళ్లీ మళ్లీ చూస్తా.. థియేటర్ మీ ఇంటికి వచ్చేసింది అంటూ డైలాగులు చెప్పాడు.


దీన్ని బట్టి చూస్తుంటే వి సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయినట్లు అర్థమవుతుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటించాడు. నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. దిల్ రాజు నిర్మాత. దాదాపు 33 కోట్లకు ఈ సినిమాను అమ్మేసినట్లు ప్రచారం జరుగుతుంది.

నాని వి సినిమా (Nani V movie poster)
నాని వి సినిమా (Nani V movie poster)

ఒకవేళ నాని సినిమా థియేటర్స్‌లో విడుదలైనా కూడా అంత మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రాలేదు. వి సినిమాను సెప్టెంబర్‌లో ఓటిటి విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తేదీ ఏంటనేది ఆగస్ట్ 20న వి టీం చెప్పనుంది. మొత్తానికి నాని లాంటి స్టార్ హీరో సినిమానే ఓటిటిలో వస్తుంటే మిగిలిన సినిమాలు కూడా ఒక్కొక్కటిగా రావడం ఖాయమే.

First published:

Tags: Hero nani, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు