హోమ్ /వార్తలు /సినిమా /

మరికొన్ని గంటల్లో V సినిమా OTT రిలీజ్, ఇంతలో స్టోరీ మొత్తం చెప్పేసిన నాని..

మరికొన్ని గంటల్లో V సినిమా OTT రిలీజ్, ఇంతలో స్టోరీ మొత్తం చెప్పేసిన నాని..

6. వి: ఒకవేళ థియేటర్స్‌లో విడుదలయ్యుంటే కచ్చితంగా ఈ ఏడాది మోస్ట్ టాప్ డిజాస్టర్స్‌లో వి సినిమా కూడా ఉండేదేమో..? నాని 25వ సినిమాగా వచ్చిన ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసాడు నిర్మాత దిల్ రాజు. సినిమాపై ఉన్న అంచనాలతో అక్కడ కొందరు చూసారు కానీ సినిమా మాత్రం దారుణంగా నిరాశ పరిచింది.

V movie: వి టీజర్, ట్రైలర్ చూసినపుడు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నాని 25వ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూసే వాళ్లు చాలా మందే ఉన్నారు..

వి టీజర్, ట్రైలర్ చూసినపుడు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నాని 25వ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూసే వాళ్లు చాలా మందే ఉన్నారు కూడా. అలాంటి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టడానికి మరికొన్ని గంటల్లో నాని వి సినిమా వచ్చేస్తుంది. కరోనా కారణంగా మీరు థియేటర్స్‌కు వెళ్లడం కాదు.. థియేటర్ మీ ఇంటికి వచ్చేస్తుంది. హోం థియేటర్‌లోనే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వి సినిమాను చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న వి సినిమా విడుదల కానుంది.

నాని వి సినిమా (nani sudheer V movie)
నాని వి సినిమా (nani v movie)

నాని, సుధీర్ బాబు ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. నాని తొలి సినిమా అష్టా చమ్మా విడుదలైన సెప్టెంబర్ 5నే 25వ సినిమా కూడా విడుదలవుతుంది. దిల్ రాజు దీనికి నిర్మాత. ఇదిలా ఉంటే రిలీజ్‌కు కొన్ని గంటల ముందు వి సినిమా కథపై పూర్తి హింట్ ఇచ్చేసాడు నాని. ఇన్ని రోజులు ఈ సినిమాలో కేవలం నివేదా థామస్ లుక్ విడుదల చేసారంతే. కానీ అదితి రావు హైదరీని దాచేసారు.

నాని వి సినిమా (nani sudheer V movie)
నాని వి సినిమా (nani sudheer V movie)

ఇప్పుడు నాని దాన్ని రివీల్ చేసాడు. ఫ్లాష్ బ్యాక్‌లో నాని కూడా పోలీస్ ఆఫీసర్ అని ఆయన లుక్ చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. దానికి తోడు ఒకప్పుడు వీడు కూడా అందరిలాంటి వాడే అంటూ పోస్ట్ చేసాడు నాని. ఈయన విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే తన భార్య అదితి రావును చంపేసిన వాళ్లపై పగ తీర్చుకోడానికి నాని సైకోగా మారిపోయాడేమో అనిపిస్తుంది.

నాని వి మూవీ కొత్త పోస్టర్ (nani v movie)
నాని వి మూవీ కొత్త పోస్టర్ (nani v movie)

రివేంజ్ కథనే ఇంద్రగంటి మోహనకృష్ణ తనదైన స్టైల్‌లో అదిరిపోయే స్క్రీన్ ప్లేతో రాసుకున్నాడని అనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా అభిమానులతో పాటు అందరికీ ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయం అంటున్నారు వి చిత్రయూనిట్. ఏదేమైనా కూడా విడుదలకు కొన్ని గంటల ముందే స్టోరీ అయితే బయటపెట్టేసాడు నాని.

First published:

Tags: Hero nani, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు