హోమ్ /వార్తలు /సినిమా /

V Movie Review: నాని, సుధీర్ బాబు ‘వీ’ మూవీ రివ్యూ..

V Movie Review: నాని, సుధీర్ బాబు ‘వీ’ మూవీ రివ్యూ..

నాని,సుధీర్ బాబు ‘V’ సినిమా (nani sudheer V movie)

నాని,సుధీర్ బాబు ‘V’ సినిమా (nani sudheer V movie)

Nani V Movie Review | లాక్ డౌన్ వచ్చిన తర్వాత సినిమాలేవీ లేక ఆడియన్స్ పిచ్చెక్కిపోయి ఉన్నారు. మధ్య మధ్యలో చిన్న సినిమాలు వచ్చాయి కానీ ఏవీ పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో నాని నటించిన వి సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మరి నాని 25వ సినిమా ఎలా ఉందో చూద్దాం..

ఇంకా చదవండి ...

రివ్యూ: వి

నటీనటులు: నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి, వెన్నెల కిషోర్..

ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్

నేపథ్య సంగీతం: తమన్

సంగీతం: అమిత్ త్రివేది

నిర్మాత: దిల్ రాజు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇంద్రగంటి మోహన కృష్ణ

లాక్ డౌన్ వచ్చిన తర్వాత సినిమాలేవీ లేక ఆడియన్స్ పిచ్చెక్కిపోయి ఉన్నారు. మధ్య మధ్యలో చిన్న సినిమాలు వచ్చాయి కానీ ఏవీ పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో నాని నటించిన వి సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మరి నాని 25వ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ:

ఆదిత్య (సుధీర్ బాబు) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. డ్యూటీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయడు. అలాంటి పోలీస్ ఆఫీసర్ లైఫ్ లోకి ఒక హత్య చేసిన విష్ణు (నాని) వస్తాడు. ముందుగా ఒక పోలీసుని చంపి పట్టుకోమని సవాల్ చేస్తాడు. ఆ తర్వాత మరికొన్ని హత్యలు కూడా చేస్తానని చాలెంజ్ విసురుతాడు. ఆ కేసులో బిజీగా ఉన్నా ఆదిత్య లైఫ్ లోకి సైకాలజీ చదివిన అపూర్వ (నివేద థామస్) వస్తుంది. ఆ సైకోను పట్టుకోవడానికి ఆదిత్యకు తన వంతు ప్రయత్నం అందిస్తుంది. అసలు విష్ణు ఎందుకు అలా హత్యలు చేస్తున్నాడు.. ఆదిత్య పట్టుకున్నాడా లేదా.. అనేది మిగిలిన కథ.

కథనం:

ఎలా ఫినిష్ చేద్దాం చెప్పు.. మళ్లీ అంచనాలను అందుకోలేదని మాట రాకూడదు.. ట్రైలర్లో నాని చెప్పిన డైలాగ్ ఇది. ఇది విన్న తర్వాత.. టీజర్ చూసిన తర్వాత అంచనాలు కూడా అలాగే పెరిగిపోతాయి. దానికి తోడు నాని 25వ సినిమా కాబట్టి ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తాను ఇలాంటి డిఫరెంట్ పాత్ర ఎంచుకున్నాను అని చెప్పాడు. దానికి తగ్గట్లుగానే సినిమా మొదలు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. చక్కటి స్క్రీన్ ప్లేతో మొదలు పెట్టాడు ఇంద్రగంటి మోహన కృష్ణ. సినిమా మొదట్లోనే హిందూ ముస్లిం గొడవలు.. అల్లర్లు జరగటం.. అక్కడి నుంచి కథ మొదలు కావడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. 20 నిమిషాల తర్వాత నాని ఎంట్రీ.. వచ్చి రాగానే ఒక మర్డర్.. ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. కానీ మెల్ల మెల్లగా కథ తెలుసుకోవడం.. నాని చంపుతున్నది క్రిమినల్ గ్యాంగ్ అని అర్థం కావడంతో కథలు ప్రధానమైన ట్విస్ట్ ఇంటర్వెల్ కంటే ముందే రెడీ అయిపోయింది. దాంతో కథనం కూడా నెమ్మదించింది. అన్నింటికిమించి ఎన్నో సినిమాల్లో చూసిన రివేంజ్ డ్రామా కావడంతో.. వి అంచనాలు అందుకోలేక అక్కడక్కడే ఉండిపోయింది. దానికి తోడు నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత దర్శకుడు కూడా దాచిపెట్టడానికి ఏమీ లేదు.. క్లైమాక్స్ వరకు తెలిసిన కథనే నెమ్మదిగా లాక్కుంటూ వచ్చాడు. చివర్లో అందరూ ఊహించిన ఒక ట్విస్ట్ ఇచ్చి నాని, సుధీర్ బాబు ఇద్దరు హీరోలను చేశాడు. ఈ కథలో ఇంద్రగంటి ఇంతకంటే కొత్తగా చెప్పడానికి కూడా ఏమీ లేదు. అందుకే ఎక్కువగా యాక్షన్ పార్ట్ పై దృష్టి పెట్టాడు. నందు నుంచి నానిని విలన్ గా చూపిస్తూ అంచనాలు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ టీజర్ ట్రైలర్స్ లో చూపించిన శ్రద్ధ సినిమాలో కనిపించలేదు. సుధీర్ బాబు, నివేద థామస్ మధ్య వచ్చే ఎపిసోడ్స్ అంతగా ఆకట్టుకోలేదు. నాని, అదితి రావు హైదరి ఫ్లాష్ బ్యాక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఓవరాల్ గా నాని 25వ సినిమా ఇలా ఉంటుందని మాత్రం ఊహించరు.

నటీనటులు:

కథలో విషయం ఉన్నా లేకపోయినా నాని మాత్రం తన పాత్రకు న్యాయం చేస్తాడు. నటుడిగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇలా ఓడిపోలేదు. వి సినిమాలో కూడా ఈ పాత్రను తనదైన శైలిలో రక్తి కట్టించాడు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా సరిపోయాడు. ఈ పాత్రని కూడా బాగానే డిజైన్ చేసాడు ఇంద్రగంటి. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ నివేదా థామస్ తో పెద్దగా పనిలేదు. అదితి రావు హైదరి పర్లేదు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా ఓకే. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీం:

వి సినిమాకు తమన్ నేపథ్య సంగీతం బాగానే ప్రాణం పోసింది. అమిత్ త్రివేది పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ చాలా వీక్. సుధీర్ బాబు, నివేద ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ కూడా హైలైట్. ఇక దర్శకుడిగా ఇంద్రగంటి మోహన కృష్ణ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. స్క్రీన్ ప్లే అద్భుతంగా రాస్తాడు అని పేరున్న ఈ దర్శకుడు.. వి సినిమా విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. అక్కడక్కడ ఆసక్తికరంగా అనిపించింది కానీ పూర్తి స్థాయిలో ఇంద్రగంటి సినిమా మాత్రం ఇది కాదు. దిల్ రాజు నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి.

చివరగా ఒక్కమాట:

V.. థియేటర్లో అయితే కష్టం.. హోమ్ థియేటర్ కాబట్టి జస్ట్ ఓకే..

రేటింగ్: 2.5/5

First published:

Tags: Aditi Rao Hydari, Dil raju, Indraganti Mohana Krishna, Nani, Nani V Movie, Nivetha Thomas, Sudheer Babu, Tollywood