హోమ్ /వార్తలు /సినిమా /

‘V’ సినిమా విడుదల సందర్భంగా న్యూస్18తో సుధీర్ బాబు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

‘V’ సినిమా విడుదల సందర్భంగా న్యూస్18తో సుధీర్ బాబు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

న్యూస్ 18తో సుధీర్ బాబు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ (Twitter/Photo)

న్యూస్ 18తో సుధీర్ బాబు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ (Twitter/Photo)

V Movie Review Sudheer Babu Exclusive Interview News18 Telugu | తొలిసారి ఓ భారీ బ‌డ్జెట్ చిత్రంగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది... ‘వీ’ ఈ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా చిత్రంలో కిల‌క పాత్ర పోషించిన న‌టుడు సుధీర్ బాబు న్యూస్ 18 తెలుగుతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. సినిమాకు సంబందించి చాలా విష‌యాలు న్యూస్18 తో పంచుకున్నారు.

ఇంకా చదవండి ...

Sudheer Babu Exclusive Interview | కోవిడ్ ఎఫెక్ట్ అన్ని రంగాల‌పై ప‌డింది...ముఖ్యంగా సినిమా రంగంపై ఈ ప్ర‌భావం చాలా తీవ్రంగా ఉంద‌నే చెప్పుకోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సినిమా స్టైల్ నే మార్చేసింది క‌రోనా. తొలిసారి ఓ భారీ బ‌డ్జెట్ చిత్రంగా ఓటీటీలో రిలీజ్ అయింది. ‘వీ’ ఈ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించిన హీరో సుధీర్ బాబు న్యూస్ 18 తెలుగుతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. సినిమాకు సంబందించి చాలా విష‌యాలు న్యూస్18 తో పంచుకున్నారు.

ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహాన్ కృష్ణ‌తో ఇది మీకు రెండో సినిమా ఎలా అనిపిస్తోంది?

మోహాన్ సార్ నాకు ఎప్పుడూ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తే ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది ఆయ‌నే....ఇంద్రగంటి నాకు క‌థ చెప్ప‌క‌పోయిన ప‌ర్వాలేదు...నేను యాక్ట్ చేయ‌డానికి సిద్దంగా ఉంటాను. ఆయన సినిమాల్లో యాక్ట్ చేయ‌డం ఒక పెద్ద క్వాలిఫీకేష‌న్ లాంటిది. అంటే అదో పెద్ద డిగ్రీ లాంటిది. ఆ లెక్క‌న నాకు రెండు డిగ్రీలు వ‌చ్చాయి. నానికి మూడు డిగ్రీలు వ‌చ్చాయి.

నానీతో యాక్ట్ చేయ‌డం ఎలా అనిపించింది?

ఖ‌చ్చితంగా అదో గుడ్ ఫిలింగ్ అండీ. నానీతో యాక్ట్ చేయడం చాలా కంఫ‌ర్ట్‌గా  ఫీల్ అవుతాను. ఇద్ద‌రం సెట్స్ లో చాలా స‌ర‌దాగా ఉండేవాళ్లం. మొత్తం అల్ల‌రి, అల్ల‌రి చేయ‌సేవాళ్లం సెట్స్ లో.

ప్ర‌స్తుతం భారీ చిత్రాలు కూడా ఓటీటీలో విడుద‌ల చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో మీకు ఏమైన మంచి వైబ్ సిరీస్ చేయాలని ఏమైన ఉందా?

త‌ప్ప‌కుండా అండీ మంచి స‌బ్జెక్ట్ వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తా. ప్ర‌స్తుతం జ‌నాలు థీయేట‌ర్స్ కు వెళ్లే అవ‌కాశం లేదు కాబ‌ట్టి ఎక్క‌డ మ‌న‌కు అవ‌కాశం ఉందో అక్క‌డ వాళ్ల‌ను ఎంట‌ర్టైన్ చేయ‌డ‌మే క‌దా మన పని. ఇందులో మ‌నం చేసేదేముంది. అందుకే మంచి క‌థ‌తో ఎవ‌రైన వ‌స్తే త‌ప్పుకుండా చేస్తా.

ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల అవుతున్నందుకు ఏమైన ఫీల్ అవుతున్నారా?

మొద‌ట్లో ఉండేది బ‌ట్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు మ‌న ముందున్న వేరే మార్గం లేదు. కోవిడ్ ఎప్పుడు పోతుందో ఎవ‌రికి స‌రైన ఐడియా లేదు. అన్ని రోజులు సినిమాని ఆపుకుంటూ కూర్చోలేము క‌దా. ఇందులో మ‌రో మంచి విష‌యం కూడా ఉంది ఇలా ఓటీటీలో విడుద‌ల అవుతున్నందున మా సినిమా ఇప్పుడు 233 దేశాల్లో ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో ఉంది. మ‌న సినిమా స్టైయిల్ ను ఇత‌ర దేశాల‌కు ప‌రిచ‌యం చేయ‌డానికి వీలుంటుంది.

నానిలో మీకు న‌చ్చింది....అండ్ న‌చ్చ‌న‌ది ఏంటీ?

న‌చ్చేది అంటే సెట్స్ లో త‌ను సీన్‌ను డెవ‌ల‌ఫ్ చేసే విధానం చాలా బాగుటుంది. సీన్ కి అప్ప‌టిక‌ప్పుడు చాలా యాడ్ చేస్తాడు అది సినిమాకు చాలా ప్లస్ అవుతుంది కూడా. న‌చ్చ‌న‌ది అంటే...అంద‌రికి తెలిసిందే ఫోన్ తో ఎక్కువ ఉండ‌డం. సెట్స్ లో నేను వెన్నెల కిషోర్ ఇదే విష‌యంపై నానికి ఎక్కువ ఆట ప‌ట్టించే వాళ్లం.

ఈ సినిమా ద్వారా మీ ప్యాన్స్ కి ఏం చెప్ప‌ద‌ల్చుకున్నారు?

ఒక్క‌టే మాట ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లా ఉంటుంది అంద‌రు చూసి ఎంజాయ్ చేయండి.

First published:

Tags: Nani, Nani V Movie, Sudheer Babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు