రామ్ చరణ్ సమాధానంపై ఉయ్యాలవాడ కుటుంబీకుల రియాక్షన్..

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమాను తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఇది వంశస్థుడి సినిమా కావడంతో తమకు కచ్చితంగా న్యాయం చేయాలని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 20, 2019, 7:20 PM IST
రామ్ చరణ్ సమాధానంపై ఉయ్యాలవాడ కుటుంబీకుల రియాక్షన్..
చిరంజీవి, రామ్ చరణ్
  • Share this:
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమాను తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఇది వంశస్థుడి సినిమా కావడంతో తమకు కచ్చితంగా న్యాయం చేయాలని.. తమ అనుమతి లేకుండా సినిమా చేస్తే న్యాయపరంగా పోరాడుతాం అంటూ ఉయ్యాలవాడ కుటుంబీకులు సవాల్ చేసారు. దీనిపై రామ్ చరణ్ కూడా దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. సైరా ట్రైలర్ లాంఛ్ వేడుకలో మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అనే వ్యక్తి కుటుంబం కోసం కాదు.. దేశం కోసం బతికాడని.. ఆయన దేశం కోసం తన ప్రాణం త్యాగం చేసాడు కానీ కుటుంబం కోసం కాదన్నాడు.
Uyyalawada Narasimha Reddy family reaction on Ram Charan sensational answer on Sye Raa rights pk ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమాను తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఇది వంశస్థుడి సినిమా కావడంతో తమకు కచ్చితంగా న్యాయం చేయాలని.. uyyalawada narasimha reddy,uyyalawada narasimha reddy family,sye raa narasimha reddy movie,sye raa movie,sye raa movie twitter,ram charan sye raa,ram charan uyyalawada narasimha reddy rights,chiranjeevi sye raa movie,sye raa movie release date,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా రిలీజ్ డేట్,ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి,తెలుగు సినిమా
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫైల్ ఫోటో

తను సాయం చేయాల్సి వస్తే.. ఆ ఊరుకు చేస్తాను కానీ ఒక్క కుటుంబానికి మాత్రం కాదని తేల్చేసాడు. అలా ఆయన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసి ఆయన వ్యాల్యూ తీయలేనని చెప్పాడు రామ్ చరణ్. పైగా ఓ మనిషి జీవితం 100 ఏళ్లు దాటితే చరిత్ర అవుతుందని.. దాని గౌరవార్థం ఎవరైనా ఆ చరిత్ర తెరకెక్కించే హక్కుందని చెప్పాడు ఈయన. అయితే ఇప్పుడు రామ్ చరణ్ చెప్పిన సమాధానం ఉయ్యాలవాడ కుటుంబీకులకు అస్సలు మింగుడు పడటం లేదు.

Uyyalawada Narasimha Reddy family reaction on Ram Charan sensational answer on Sye Raa rights pk ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమాను తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఇది వంశస్థుడి సినిమా కావడంతో తమకు కచ్చితంగా న్యాయం చేయాలని.. uyyalawada narasimha reddy,uyyalawada narasimha reddy family,sye raa narasimha reddy movie,sye raa movie,sye raa movie twitter,ram charan sye raa,ram charan uyyalawada narasimha reddy rights,chiranjeevi sye raa movie,sye raa movie release date,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా రిలీజ్ డేట్,ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి,తెలుగు సినిమా
సైరా పోస్టర్ (Source: Twitter)

నిజానికి ఈ కుటుంబానికి ముందు 75 లక్షల వరకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత రామ్ చరణ్. కానీ మధ్యలో ఏదో వాదనలు జరిగేసరికి ఇప్పుడు పూర్తిగా కొత్త కోణం తెరపైకి తీసుకొచ్చాడు మెగా ప్రొడ్యూసర్. మొత్తానికి చరణ్ ఇచ్చిన ఊహించని షాక్‌తో నిజంగానే ఉయ్యాలవాడ ఫ్యామిలీ షాక్‌లో ఉన్నారు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు