రెండుగా చీలిపోయిన ఉయ్యాలవాడ కుటుంబం.. చిరంజీవికి సన్మానం..

సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదలయ్యేంత వరకు కూడా చాలా వివాదాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాను చుట్టుమట్టి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కేసు కూడా ఫైల్ చేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 22, 2019, 1:05 PM IST
రెండుగా చీలిపోయిన ఉయ్యాలవాడ కుటుంబం.. చిరంజీవికి సన్మానం..
‘సైరా నరసింహారెడ్డి’ (Source: Twitter)
  • Share this:
సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదలయ్యేంత వరకు కూడా చాలా వివాదాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాను చుట్టుమట్టి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కేసు కూడా ఫైల్ చేసారు. తమకు డబ్బు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మోసం చేస్తున్నారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేస్ కూడా నమోదు చేసారు. ఇలాంటి సమయంలో మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఉయ్యాలవాడ కుటుంబంలోని మరికొందరు తమకు ఇప్పుడు తమ ఊళ్లో నెలకొల్పబోతున్న ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది.

Uyyalawada Narasimha Reddy family devided into two and another party honoring Chiranjeevi pk సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదలయ్యేంత వరకు కూడా చాలా వివాదాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాను చుట్టుమట్టి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కేసు కూడా ఫైల్ చేసారు. Uyyalawada Narasimha Reddy,sye raa,sye raa twitter,sye raa chiranjeevi,sye raa pre release event,chiranjeevi ram charan,Uyyalawada Narasimha Reddy honoring chiranjeevi,Uyyalawada Narasimha Reddy statue,Uyyalawada Narasimha Reddy family case,sye raa case,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి,సైరా ట్విట్టర్,సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్,తెలుగు సినిమా,చిరంజీవి రామ్ చరణ్
సైరా పోస్టర్ (Source: Twitter)

అంతేకాదు ఆ వేడుకలో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కొందరు ప్రత్యేకంగా చిరంజీవిని సత్కరించబోతున్నట్లు ఉయ్యాలవాడ కుటుంబంలోని కొందరు సభ్యులు మీడియాకు ప్రకటన విడుదల చేసారు. దాంతో ఈ కుటుంబం అధికారికంగా రెండు ముక్కులైపోయిందని అర్థమవుతుంది. కొందరికి చిరంజీవి ఈ చిత్రం చేయడం ఇష్టమే.. కానీ మరికొందరు మాత్రం అడ్డుపడుతున్నారు. వాళ్లలో వాళ్లే ఇలా గొడవపడి బయటికి వచ్చేసారు.

Uyyalawada Narasimha Reddy family reaction on Ram Charan sensational answer on Sye Raa rights pk ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమాను తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఇది వంశస్థుడి సినిమా కావడంతో తమకు కచ్చితంగా న్యాయం చేయాలని.. uyyalawada narasimha reddy,uyyalawada narasimha reddy family,sye raa narasimha reddy movie,sye raa movie,sye raa movie twitter,ram charan sye raa,ram charan uyyalawada narasimha reddy rights,chiranjeevi sye raa movie,sye raa movie release date,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా రిలీజ్ డేట్,ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి,తెలుగు సినిమా
సైరా పోస్టర్ (Source: Twitter)

అంతేకాదు తామసలు చిరంజీవిని ఏ ఒక్క రోజు కూడా డబ్బు ఇవ్వాలని అడిగినట్లు లేదని.. ఆయన చేస్తున్న 'సైరా' వల్ల తమ కుటుంబానికి ఎలాంటి నష్టం లేదని చెబుతున్నారు వాళ్లు. ఇదంతా కావాలని ఎవరో వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం అంటూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కొట్టి పారేయడం ఇక్కడ అసలు ట్విస్ట్. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవన్నీ చేస్తున్నారంటూ వాళ్లు చెప్పడం ఇప్పుడు సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతుంది.

Uyyalawada Narasimha Reddy family devided into two and another party honoring Chiranjeevi pk సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదలయ్యేంత వరకు కూడా చాలా వివాదాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాను చుట్టుమట్టి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కేసు కూడా ఫైల్ చేసారు. Uyyalawada Narasimha Reddy,sye raa,sye raa twitter,sye raa chiranjeevi,sye raa pre release event,chiranjeevi ram charan,Uyyalawada Narasimha Reddy honoring chiranjeevi,Uyyalawada Narasimha Reddy statue,Uyyalawada Narasimha Reddy family case,sye raa case,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి,సైరా ట్విట్టర్,సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్,తెలుగు సినిమా,చిరంజీవి రామ్ చరణ్
రామ్‌చరణ్, సురేందర్ (ఫైల్ ఫొటోస్)

నిజానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నలుగురు భార్యలున్నారని చెప్తుంటారు. అంటే ఆయన కుటుంబ సభ్యులు వందల్లో ఉండే అవకాశం ఉంది. అందులో ఎవరు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డికి అసలు వారసులు అనేది కూడా చెప్పడం కష్టమే. దానికితోడు ఓ మనిషి జీవితం 100 ఏళ్లు దాటితే చరిత్ర అవుతుందని సుప్రీం కోర్ట్ కూడా తీర్పిచ్చిందని రామ్ చరణ్ చెప్పాడు. దాంతో ఇప్పుడు ఈ వివాదాల నుంచి సైరా నరసింహా రెడ్డి ఈజీగానే బయటపడే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading