ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మనవరాలి పెళ్లి..

ఉయ్యాలవాడ ముని మనవరాలు సంజన రెడ్డి వివాహం చెన్నై నివాసి అయిన ప్రతాప్ రెడ్డితో ఆగస్ట్ 19న ఘనంగా జరిగింది. హైదరాబాద్‌‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రాష్ట్ర ప్రముఖులు అంతా హాజరయ్యారు.

news18-telugu
Updated: August 21, 2018, 6:55 PM IST
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మనవరాలి పెళ్లి..
uyyalawada narasimha reddy grand daughter
  • Share this:
కొన్ని రోజుల కింది వరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఎవరికి పెద్దగా తెలియదు. కేవలం స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు.. చరిత్ర తెలిసిన వాళ్లు మాత్రమే ఈయన్ని గుర్తు పెట్టకున్నారు. పుస్తకంలో పాఠంలా.. చరిత్రలో పేజీలా.. వికిపీడియాలో అప్పుడప్పుడూ చదువుకునే వివరంలా మిగిలిపోయాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కానీ ఈయన భారతదేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు అని చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ చరిత్రను తవ్వి బయటికి తీస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

sye raa
సైరా మూవీ పోస్టర్!


ఈయన నటిస్తున్న "సైరా నరసింహారెడ్డి" ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. చిరు ప్రాజెక్ట్ ప్రకటించిన తర్వాతే అసలెవరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. వాళ్ల కుటుంబం గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కుటుంబంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముని మనవరాలు పెళ్లి చేసుకుంది. ఉయ్యాలవాడ ముని మనవరాలు సంజన రెడ్డి వివాహం చెన్నై నివాసి అయిన ప్రతాప్ రెడ్డితో గత వారమే ఘనంగా జరిగింది. హైదరాబాద్‌‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రాష్ట్ర ప్రముఖులు అంతా హాజరయ్యారు.
ఈ పెళ్లి ఇంతగా హైలైట్ అవ్వడానికి కారణం కూడా చిరంజీవే. కేవలం ఈయన చేస్తోన్న బయోపిక్ ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై.. ఆయన కుటుంబంపై ఆసక్తి పెంచేసింది. ఈ పెళ్లికి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఈ పెళ్లి వేడుకలోనే ఉయ్యాలవాడ వారసులు మాట్లాడుతూ.. తమ వీరుడి జీవితాన్ని ముందు తామే నిర్మించాలని అనుకున్నామని.. కానీ అనుకోని కారణాలతో కుదరలేదని చెప్పారు.

ఇప్పుడు ఏకంగా చిరంజీవి లాంటి మెగాస్టార్ వచ్చి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని "సైరా నరసింహారెడ్డి"గా తెరకెక్కిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. అప్పట్లో ఈ సినిమాను సుమన్, సాయికుమార్‌లతో ప్లాన్ చేసారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు. అప్పుడు కుదరని ప్రాజెక్ట్ ఇప్పుడు వర్కవుట్ అయింది. తాజాగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఖైదీ నెం.150తో నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్.. ఈ సినిమాను 200 కోట్లతో నిర్మిస్తున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 21, 2018, 6:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading