మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ నిర్మాణంలో రామ్ చరణ్ ఈ సినిమాను దాదాపు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది.‘సైరా’ సినిమాను ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ తెరకెక్కించారు.రీసెంట్గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు చిత్ర నిర్మాణ సమయంలో తమకు న్యాయం చేయాలంటూ చిరంజీవి ఆఫీసు ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయమై ఉయ్యాలవాడ కుటంబ సభ్యులు చిరంజీవితో పాటు సైరా టీమ్ పై పోలీసులు కేసులు నమోదు చేసారు. తాజాగా ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఈ సినిమా విడుదలను ఆపు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. రేపు ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది హైకోర్టు.
‘సైరా నరసింహారెడ్డి’ (Source: Twitter)
అంతేకాదు చిరంజీవి ,రామ్ చరణ్ తమను (ఉయ్యాలవాడ) వారసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు పిర్యాదు లో పేర్కొన్నారు. అంతేకాదు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథ తీసుకొని మోసం చేశారని పేర్కొన్నారు. కథ తీసుకున్న తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ లు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. మాట తప్పారన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తే తమపైనే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తమకు న్యాయం జరిగే వరకు సైరా నరసింహా రెడ్డి సినిమాను విడుదల చేయోద్దంటూ పిటిషన్లో పేర్కొన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.