ప్రతిరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు మారుతి. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం 34 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇంకా మంచి వసూళ్లు తీసుకొస్తుంది ఈ చిత్రం. మరో సినిమా ఏదీ పోటీ లేకపోవడంతో ప్రతిరోజూ పండగ చేసుకుంటుంది ఈ చిత్రం. మారుతి కెరీర్లోనే కాకుండా సాయి కెరీర్లో కూడా ఇదే పెద్ద హిట్. భలే భలే మగాడివోయ్ తర్వాత అంతటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మారుతి. ఇక తమ బ్యానర్‌కు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు మారుతికి గిఫ్ట్ ఇచ్చారు నిర్మాతలు. యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ మారుతికి మరచిపోలేని బహుమతిని ఇచ్చాడు.
Thank you Vamsi darling
— PratiRojuPandaage In theaters (@DirectorMaruthi) January 8, 2020
nee lanti friend unte#PratiRojuPandaage 😍🤗 pic.twitter.com/5d9UYdM7iY
దర్శకుడు మారుతికి రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి వంశీ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈయనకు ఇచ్చిన ఈ కార్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. ఖరీదైన బహుమతి రావడంతో మారుతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఈయన తర్వాతి సినిమా స్టార్ హీరోతో ఉండబోతుంది. అయితే అదెవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇదిలా ఉంటే ప్రతిరోజూ పండగే ఫుల్ రన్ పూర్తయ్యే సరికి ఈజీగా 36 కోట్ల వరకు షేర్ వసూలు చేసి డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maruthi, PratiRoju Pandaage, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood