హోమ్ /వార్తలు /సినిమా /

Uttej : టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో భార్య కన్నుమూత..

Uttej : టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో భార్య కన్నుమూత..

ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత (File/Photo)

ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత (File/Photo)

Uttej : టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో భార్య పద్మావతి కన్నుమూత. వివరాల్లోకి వెళితే..

Uttej : టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ (Uttej) ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో భార్య పద్మావతి (Padmavathi) కన్నుమూత. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు చెందిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. పద్మావతి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తేజ్ విషయానికొస్తే.. ఈయన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ట్రెండ్ సెట్టర్ మూవీ ‘ శివ’తో పరిచయమయ్యారు. అప్పటి నుంచి నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు.

నటనతో పాటు ఈయనలో మంచి రచయత కూడా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘మనీ’ సినిమాతో రచయతగా మారారు. దీంతో పాటు ‘మనీ మనీ’, ఖడ్గం’ వంటి సినిమాలకు మాటల రచయతగా పనిచేసారు.ప్రముఖ సినీ గేయ రచయత సుద్దాల అశోక్ తేజ్ ఈయనకు మేనమామ అవుతారు. ఈ ప్రోద్బలంతోనే ఈయన సినీ గేయ రచయతగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.


సినిమా మల్టీటాలెంట్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ఈయన. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈయన కూతురు కూడా హీరోయిన్‌గా తన లక్‌ను పరీక్షించుకుంది. ఇక ఈయన భార్య అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి.

Hit Movie Remake Bollywood: అధికారికంగా ప్రారంభమైన ’హిట్’ హిందీ రీమేక్.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల హంగామా..


సినీ ఇండస్ట్రీ విషయానికొస్తే.. ఈ యేడాది  టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్, శాండిల్ వుడ్ అనే తేడా లేకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనాతో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూసారు. ఇప్పటికే తమిళ కమెడియన్ వివేక్.. ఆ తర్వాత సీనియర్ నటుడు పొట్టి వీరయ్య..  దర్శకుడు సాయి బాలాజీ, దర్శకుడు కేవి ఆనంద్ వంటి వారు కన్నుమూసారు.

NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..


అటు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌తో పాటు అలనాటి కథానాయికగా జయంతి, ఆనంద్ కణ్ణన్‌తో, హాలీవుడ్ నటుడు మైఖేల్ విలియమ్‌తో పాటు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా సహా చాలా మంది  ఈ యేడాదే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.  ఇవి మరవక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకోవడం దురదృష్ణకరం.

First published:

Tags: Tollywood, Uttej

ఉత్తమ కథలు