HOME »NEWS »MOVIE »uttarpradesh cm yogi adityanath issues open warning to tandav actor saif ali khan and director ali abbas zafar ms

Tandav: మూల్యం చెల్లించక తప్పదు.. తాండవ్ బృందానికి యూపీ సీఎం యోగి ఘాటు హెచ్చిరిక

Tandav: మూల్యం చెల్లించక తప్పదు.. తాండవ్ బృందానికి యూపీ సీఎం యోగి ఘాటు హెచ్చిరిక
యోగి, సైఫ్ అలీ ఖాన్ (ఫైల్)

Tandav In Trouble: అమోజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ తీవ్ర వివాదాలను మూట గట్టుకుంటున్నది. తాజాగా దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందిస్తూ... ‘మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉండండి...’ అంటూ హెచ్చరించారు.

  • News18
  • Last Updated: January 18, 2021, 21:59 IST
  • Share this:
    చాలా కాలం తర్వాత ఒక బాలీవుడ్ సినిమా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బాలీవుడ్  హీరోయిన్ దీపికా పదుకునే నటించిన పద్మావత్ తర్వాత దాదాపు ఏ సినిమాకు ఇంత వివాదం కాలేదు. మధ్యలో కొన్ని సినిమాల మీద విమర్శలు వచ్చినా ఆ స్థాయిలో రాలేదు. కాగా... హిందూ దేవతలను, దళితులను అవమానించేలా సీన్స్ ఉన్నాయని ఆరోపిస్తూ తాండవ్ సినిమాపై నిషేధం విధించాలని ఇప్పటికే నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఈ సినిమా దర్శక నిర్మాత లపై కేసులు కూడా నమోదుచేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ (yogi adityanath) దర్శక నిర్మాతలకు ఘాటు హెచ్చరిక చేశారు.

    అమోజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ తీవ్ర వివాదాలను మూట గట్టుకుంటున్నది. తాజాగా దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందిస్తూ... ‘మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉండండి...’ అంటూ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మీడియా సలహాదారు షలాబ్ మణి త్రిపాఠి ట్విట్టర్ లో స్పందించారు.







    ఆయన స్పందిస్తూ... ‘మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి. యూపీ పోలీసులు ముంబైకి బయల్దేరారు..’ అని ట్వీట్ చేశారు. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, నిర్మాత హిమాన్షు మెహ్రా, రచయిత గౌరవ్ సోలంకి, నటుడు సైఫ్ అలీఖాన్, జీషన్ అయూబ్ లను ట్యాగ్ చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేశారు. అంతేగాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కార్యాలయాన్ని కూడా ట్యాగ్ చేసి.. ‘మీరు వారి రక్షణకు రారని ఆశిస్తున్నాను... ’ అని రాసుకొచ్చారు.





    అంతకుముందు త్రిపాఠి ట్వీట్ చేస్తూ.. ‘యూపీలో ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి చూస్తే చూస్తూ ఊరుకునేది లేదు. చౌకబారు వెబ్ సిరీస్ ల ముసుగులో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న తాండవ్ బృందంపై కేసు నమోదైంది. అరెస్టుకు సిద్ధంగా ఉండండి...’ అంటూ రాసుకొచ్చారు.
    Published by:Srinivas Munigala
    First published:January 18, 2021, 21:59 IST