Ram Pothineni : గాయపడ్డ హీరో రామ్ పోతినేని.. ఫోటోను షేర్ చేసిన ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్..

షూటింగ్ స్పాట్‌లో గాయపడ్డ రామ్ పోతినేని (Twitter/Photo)

Ram Pothineni : టాలీవుడ్ యువ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తర్వాత ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగాఈ సినిమా కోసం రామ్ పోతినేని బాడీ ట్రాన్స్‌ఫామ్ చేస్తుండగా నెక్ ఇంజ్యూరి అయింది.

  • Share this:
    Ram Pothineni : గాయపడ్డ హీరో రామ్ పోతినేని.. ఫోటోను షేర్ చేసిన ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ యువ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తర్వాత ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామి (Lingu Saamy) తో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్‌ను స్టార్ట్ అయింది. సెట్స్ ఉన్న ఈ సినిమాకు ‘ఉస్తాద్’ (Ustaad) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజాగా ఈ సినిమా కోసం పాత్రలో వేరియేషన్ చూపించడానికి రామ్ పోతినేని జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా.. మెడ దగ్గర కాస్త బెణికింది. దీంతో ఈ సినిమా షూటింగ్‌కు రామ్ పోతినేని బ్రేక్ ఇచ్చారు. అంతేకాదు ఆయన గాయంతో ఉన్న ఫోటోను చిత్ర యూనిట్ మీడియాకు సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. ప్రస్తుతం చిత్ర దర్శకుడు ఆయన లేని సీన్స్‌ను షూట్ చేస్తున్నట్టు సమాచారం.

    #RAPO19 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఆడియో హక్కులకు ఆదిత్య మ్యూజిక్ సంస్థ భారీ ధర చెల్లించి దక్కిచుకుంది.  ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. రామ్‌ సరసన కృతిశెట్టి నటిస్తోంది.

    Nayanthara - Anushka: అనుష్క టూ నయనతార.. ఆ తరహా పాత్రలో ఇరగదీసిన భామలు..

    మరో ముఖ్య పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.



    ఇక ఈ సినిమా దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. ఈ సినిమా తర్వతా రామ్ పోతినేని.. బోయపాటి శ్రీను (Boyapati Srinu)తో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం.

    Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    దాంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఈయన ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాను స్రవంతి మూవీస్, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: