ట్రంప్ మెచ్చిన భారతీయ సినిమా... గ్రేట్ అంటూ కితాబు..

Donald Trump on Shubh Mangal Zyada Saavdhan : ఆయుష్మాన్ ఖురానా, జితేంద్ర కుమార్‌లు ప్రధాన పాత్రల్లో హిందీలో నటించిన రొమాంటిక్ కామెడీ 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్'.

news18-telugu
Updated: February 22, 2020, 1:36 PM IST
ట్రంప్ మెచ్చిన భారతీయ సినిమా... గ్రేట్ అంటూ కితాబు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Photo : Twitter
  • Share this:
Shubh Mangal Zyada Saavdhan : ఆయుష్మాన్ ఖురానా, జితేంద్ర కుమార్‌లు ప్రధాన పాత్రల్లో హిందీలో నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' (Shubh Mangal Zyada Saavdhan). హితేష్ కేవల్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. అది అలా ఉంటే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈ సినిమాను మెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే బ్రిటీష్ మానవ హక్కుల కార్యకర్త పీటర్ గ్యారీ టాచెల్ 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' సినిమాపై ఒక ట్వీట్ చేశారు. హిందీలో స్వలింగ సంపర్కులకు సంబందించి ఓ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ రిలీజయ్యింది. భారత్‌లో స్వలింగ సంపర్కులకు చట్టబద్ధత వచ్చిన తరువాత, ఇప్పుడు విడుదలైన ఈ చిత్రం స్వలింగ సంపర్కం గురించి తెలుసుకోవటానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన చేసిన ట్వీట్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రీ ట్వీట్ చేస్తూ.. 'గ్రేట్' అని కామెంట్ చేశారు. దీంతో త‌మ సినిమాపై ట్రంప్ స్పందించ‌డం పట్ల 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' చిత్ర బృందం ఆనందం వ్య‌క్తం చేసింది. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త‌న భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జేరడ్ కుషనర్‌‌తో క‌లిసి ఈ నెల 24న భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.


'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' (Shubh Mangal Zyada Saavdhan) హీరో ఆయుష్మాన్ 'విక్కీ డోనర్‌' లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నాడు. అందులో భాగంగా ఆయన నటించిన 'అంధాదున్‌', 'బదాయి హో' వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయుష్మాన్ 'అంధాదున్‌' సినిమాలో నటనకు నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. వారసత్వ తారల డామినేషన్ రాజ్యమేలే చోట ఎప్పటికప్పుడు కొత్త కథలను చేస్తూ తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు.Shubh Mangal Zyada Saavdhan,US President Donald Trump on Shubh Mangal Zyada Saavdhan,US President Trump hails Bollywood gay movie,Trump on Shubh Mangal Zyada Saavdhan,Trump comments on hindi cinema,Trump comments on Shubh Mangal Zyada Saavdhan,అమెరికా అధ్యక్షుడు,శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్,డొనాల్డ్ ట్రంప్,
శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ పోస్టర్స్ Photo: Twitter
First published: February 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు