యూఎస్‌లో త్రివిక్రమ్ సమేతంగా ఎన్టీఆర్ కుమ్ముడు మాములుగా లేదుగా..!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అరవింద సమేత వీరరాఘవ’ అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 2018లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా అరవింద సమేత నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

news18-telugu
Updated: October 11, 2018, 8:49 PM IST
యూఎస్‌లో త్రివిక్రమ్ సమేతంగా ఎన్టీఆర్ కుమ్ముడు మాములుగా లేదుగా..!
అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీఆర్
  • Share this:
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అరవింద సమేత వీరరాఘవ’ అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రొటీన్ ఫ్యాక్షన్ స్టోరీని త్రివిక్రమ్ తనదైన స్టైల్లో తెరకెక్కించిన విధానాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. ఇక యూఎస్‌లో 218 లొకేషన్స్‌లో ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఒక్క ప్రీమియర్స్‌తోనే 791,021 డాలర్స్  వసూళు చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.   మన కరెన్సీలో రూ.5.85 కోట్లు వసూళు చేసింది. 2018లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా అరవింద సమేత నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

హీరోగా ఎన్టీఆర్‌కున్నమాస్ ఇమేజ్..మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్‌కున్న క్రేజ్ ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ ఓపెనింగ్స్‌కు బాగా ఉపయోగపడ్డాయి. ఇక ఫస్ట్ డే రోజు వచ్చే వసూళ్లతో యూఎస్‌లో ఈ మూవీ వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను ఈజీగా క్రాస్ చేసే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో జగపతి బాబు మరోసారి తనదైనశైలిలో విలనిజాన్ని చూపెట్టాడు. దసరా సెలవుల్లో విడుదలైన అరవింద సమేత బాక్సాఫీస్‌ను ఎంత మేరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 11, 2018, 7:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading