భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy), గీత గోవిందం (Geetha Govindam), టాక్సీవాలా (Taxi Wala), ప్రతిరోజు పండగే (Prathi roju pandage), మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachilor) లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో వచ్చిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుతున్న అల్లు శిరీష్ (Allu Sirish) ఈ సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహించగా.. అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ (Anu Emmanuel) హీరోయిన్ గా నటించింది.
ప్రస్తుత కాలంలోని అలాంటి సంక్లిష్టమైన బంధాలను గురించి తెలియజేసే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా రిలీజ్ అయింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సునీల్, ఆమని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్ర OTT రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమా పట్ల క్యూరియాసిటీ పెంచాయి. తాజాగా ఈ ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు.
ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత కాలానికి చెందిన అమ్మాయి, అబ్బాయికి చెందిన ప్రేమకథా చిత్రమిది. నేటి తరం యువ జంటలు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇలాంటి సినిమాను ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.
ఓ భావోద్వేగాన్ని మన చుట్టూ ఉండే అనే పరిస్థితులు ముందుకు నడిపిస్తాయి. ప్రతి సంబంధం దేనికదే ప్రత్యేకం. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి ఓ ఆలోచనను సమాజం ఆకట్టుకునేలా ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఎం సహ నిర్మతగా వ్యవహారించారు. రిలీజ్ తర్వాత యూత్‌ని ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా రూపొందించారనే టాక్ వచ్చింది. సో.. చూడాలి మరి OTT వేదికపై ఈ ఊర్వశివో రాక్షసివో రిజల్ట్ ఎలా ఉంటుందనేది!.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.