రివ్యూ : ఊర్వశివో రాక్షసివో (Urvasivo Rakshasivo)
నటీనటులు : అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిషోర్, ఆమని తదితరులు.. ..
ఎడిటర్: R.కార్తీక శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: తన్వీర్ మీర్
సంగీతం: అనూప్ రూబెన్స్, అచ్చు
నిర్మాత : M. విజయ్, ధీరజ్ మొగిలినేని
దర్శకత్వం: రాకేష్ శశి
విడుదల తేది : 4/11/2022
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ చిత్రంలో శిరీష్‌కు జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. యూత్‌ఫుల్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో అల్లు శిరీష్‌తో పాటు అను ఇమ్మాన్యుయేల్ వాళ్లు కోరకున్న సక్సెస్ ఈ సినిమాతో అందుకున్నారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
స్టోరీ విషయానికొస్తే.. శ్రీ కుమార్ (అల్లు శిరీష్) మిడిల్ క్లాస్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మరోవైపు సిరి (అను ఇమ్మాన్యుయేల్) ధనవంతుల అమ్మాయి. వీళ్లిద్దరి ఆలోచన సరళి వేరు. భిన్న దృవాలైన వీళ్లిద్దరు పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్ షిప్లో ఉండాలని డిసైడ్ అయితారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా ? వీరిద్దరు ప్రేమ లివింగ్ రిలేషన్ షిప్‌తోనే ఎండ్ కార్డ్ పడిందా లేకుంటే పెళ్లి వరకు వెళ్లిందా ? లేదా అనేదే ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ స్టోరీ.
కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే..
విజేత మూవీ తర్వాత దర్శకుడు రాకేష్ శశి తాను అనుకున్న ఒక సాదాసీదా పాయింట్‌తో ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీకి ఈ టైటిల్ ఎందుకు పెట్టాడనేది ఈ సినిమా చూస్తే అర్ధమవుతోంది. సినిమా మొదటి భాగం యూత్‌ఫుల్ ఎంటర్టేనర్‌గా బోల్డ్ కంటెంట్‌తో యూత్‌ను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు రాకేష్ శశి. ముఖ్యంగా శిరీష్, అను మధ్య కెమిస్ట్రీని చక్కగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అటు బోల్డ్ కంటెంట్‌తో పాటు సునీల్, వెన్నెల కిషోర్‌తో చేయించిన కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఒకవైపు బోల్డ్ కంటెంట్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేస్తూనే ఎమోషనల్ సీన్స్‌ను ఈ చిత్రంలో చక్కగా క్యారీ చేసాడు దర్శకుడు. ఒక మాములు సాదాసీదా స్టోరీని ఫుల్ ఎంటర్టైనింగ్గా యూత్‌కు నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు రాకేష్ శశి. ఈ సినిమాకు అచ్చు, అనూప్ రూబెన్స్ సంగీతం ఓ మోస్తరుగా ఉంది. ఆర్ఆర్ పర్వాలేదు. కెమెరామెన్ తన్వీర్ మీర్ అందించిన ఛాయా గ్రహణం బాగుంది. ఎడిటర్ ఫస్టాఫ్‌లో తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో హైపర్ యాక్టివ్‌గా నటించాడు. సినిమాలోని క్యారెక్టర్లో లీనమై నటించాడు. గతంలో కంటే యాక్టింగ్ విషయంలో మంచి మార్కులే కొట్టేసాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో ఈ సినిమాలో అచ్చం అలాగే ఒదిగిపోయాడు. ఇక అను ఇమ్మాన్యుయేల్ కూడా ఒక పరిణితి చెందిన ఆధునిక యువతి పాత్రలో చక్కగా నటించింది. ఇప్పటి యూత్ మైండ్ సెట్ ఎలా ఉంటుందనే దానికి చక్కని ఉదాహరణగా తన క్యారెక్టర్లో చూపించింది అను. ఇక సునీల్, వెన్నెల కిషోర్ తన కామెడీతో మరోసారి పొట్టచక్కలయ్యేలా నవ్వించారు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు పర్వాలేదనిపించారు.
ప్లస్ పాయింట్స్
అల్లు శిరీష్ నటన
వెన్నెల కిషోర్, సునీల్ కామెడీ
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్
సాదా సీదా కథ
ఫస్టాఫ్
బోల్డ్ కంటెంట్
చివరి మాట : ‘ఊర్వశివో రాక్షసివో’ యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా..
రేటింగ్ : 2.75/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu sirish, Anu emmanuel, Tollywood, Urvasivo Rakshasivo