• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • URVASHI RAUTELA WEAR DIAMOND FACE MASK AND SHARES HER VIDOE ON HER INSTAGRAM TA

Urvashi Rautela:ఊర్వశి రౌతెలా చేసిన పనికి అవాక్కవుతున్న నెటిజన్స్.. సోషల్ మీడియాలో వైరల్..

Urvashi Rautela:ఊర్వశి రౌతెలా చేసిన పనికి అవాక్కవుతున్న నెటిజన్స్.. సోషల్ మీడియాలో వైరల్..

ఊర్వశి రౌతెలా (Instagram/Photo)

Urvashi Rautela: కొంత మంది హీరోయిన్స్ వాళ్లు చేసిన సినిమాల కంటే వాళ్లు సోషల్ మీడియాలో చేసే పోస్టులతో ఎక్కువగా పాపులర్ అవుతుంటారు. అలాంటి హీరోయిన్స్‌లలో ఊర్వశి రౌతెలా ఒకరు. తాజాగా ఈ భామ మరోసారి తాను చేసిన పనితో మరోసారి వార్తల్లో నిలిచింది. 

  • Share this:
    Urvashi Rautela: కొంత మంది హీరోయిన్స్ వాళ్లు చేసిన సినిమాల కంటే వాళ్లు సోషల్ మీడియాలో చేసే పోస్టులతో ఎక్కువగా పాపులర్ అవుతుంటారు. అలాంటి హీరోయిన్స్‌లలో ఊర్వశి రౌతెలా ఒకరు. తాజాగా ఈ భామ మరోసారి తాను చేసిన పనితో మరోసారి వార్తల్లో నిలిచింది.  2013లో సన్ని దేవోల్  హీరోగా నటించిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘భాగ్ జానీ’ సినిమాలో నటించింది. ఈ మధ్యలో కన్నడలో దర్శన్ హీరోగా నటించిన ‘మిస్టర్ ఐరావతా’ సినిమాలో నటించింది. ఐనా.. ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఆ తర్వాత ‘సనమ్ రే’,
    'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో గ్లామర్ పాత్రలతో అలరించింది. ఎన్ని సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు ఈ భామకు. దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన అభిమానులకు కనులవిందు చేస్తోంది.

    ఈ భామ 2015లో మిస్ దివ కిరీటాన్ని అందుకుని.. అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. తాజాగా ఈ భామ.. తెలుగులో సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘బ్లాక్ రోజ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.



    ఆ సంగతి పక్కనపెడితే.. ఎప్పటి కప్పడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియోలో పోస్ట్ చేసే ఊర్వశి రౌతెలా .. తాజాగా వజ్రాలతో చేసిన ఫేస్ మాస్క్‌ను ధరించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొత్తంగా ఈమె చేసిన ఈ పని సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు