హోమ్ /వార్తలు /సినిమా /

Urvashi Rautela: డ్యాన్ చేస్తుండగా జారిపోయిన డైమండ్ రింగ్, బ్రాస్‌లెట్.. ఊర్వశి రియాక్షన్ చూడండి

Urvashi Rautela: డ్యాన్ చేస్తుండగా జారిపోయిన డైమండ్ రింగ్, బ్రాస్‌లెట్.. ఊర్వశి రియాక్షన్ చూడండి

ఊర్వశి రౌతేలా(ఫొటో-Instagram)

ఊర్వశి రౌతేలా(ఫొటో-Instagram)

హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా.

  హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. ఇప్పటికే అక్కడ 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. దాంతో ఎప్పటి కప్పుడు హాట్ ఫోటో షూట్‌లతో ప్రేక్షకుల మదిని మైండ్ బ్లాంక్ చేస్తోంది. బోల్డ్ ఫోటోలతో ఒకసారి.. ఖరీదైన లైఫ్‌స్టైల్‌తో మరోసారి.. ఇలా వార్తల్లో నిలుస్తోంది. అలాగే మోడలింగ్ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇండియాలోనే కాకుండా బయటి దేశాల్లో కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఓ మ్యాగజైన్‌కు సంబంధించిన షూట్‌లో పాల్గొంది.. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

  ఖరీదైన స్టైలిష్ డ్రెస్‌తో పాటుగా కోట్ల రూపాయలు విలువ చేసే అభరణాలు ధరించి షూట్‌లో పాల్గొంది. అయితే మేకప్ చేసుకుని డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేస్తుండగా అనుకుని ఘటన చోటుచేసుకోవడంతో ఊర్వశి ఉలిక్కిపడింది. డ్యాన్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆమె చేతికి ధరించిన డైమండ్ రింగ్, బ్రాస్‌లెట్ కిందపడిపోయాయి. దీంతో ఆమె వెంటనే డ్యాన్స్ ఆపి.. కంగారు పడిపోయింది. అయితే అక్కడున్నవారు కిందపడిన బ్రాస్‌లెట్, రింగ్‌ను తీసుకుని ఆమె చేతికి మళ్లీ అలకరించారు.  ఈ వీడియోలను షేర్ ఉర్వశి.. అత్యంత ఖరీదైన వస్తువులు నేల మీద పడిపోయే బాధను కేవలం అమ్మాయిలు మాత్రమే అర్థం చేసుకుంటారు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Bollywood, Urvashi Rautela, Viral Video

  ఉత్తమ కథలు