Home /News /movies /

బాలీవుడ్ నటిపై నెటిజన్ల ఫైర్... చిక్కుల్లో ఊర్వశీ రౌతేలా...

బాలీవుడ్ నటిపై నెటిజన్ల ఫైర్... చిక్కుల్లో ఊర్వశీ రౌతేలా...

నరేంద్ర మోదీ , ఊర్వశీ రౌతేల

నరేంద్ర మోదీ , ఊర్వశీ రౌతేల

సోషల్ మీడియాలో పోస్టుల్ని లైక్, షేర్ కొడితే తప్పులేదు గానీ... కాపీ కొట్టడం తప్పే. అందులోనూ ఊర్వశీ రౌతేలా లాంటి సెలబ్రిటీలు అలాంటి పనిచేస్తే... నెటిజన్లు సెటైర్లు వెయ్యకుండా ఉంటారా?

    ముంబై-పుణె హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి షబానా అజ్మీకి తీవ్ర గాయాలైన విషయం మనందరికీ తెలుసు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలూ కోరుకుంటూ ట్వీట్లు పోస్ట్ చేశారు. వారిలో ఒకరిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... "అజ్మీ షబానాకు జరిగిన ప్రమాదం ఆవేదన కలిగించింది. ఆమె వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అని ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్ మొత్తాన్నీ కాపీ కొట్టి... తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. అది చూసిన అభిమానులు షాకయ్యారు. షబానా అజ్మీకి మెసేజ్ పంపాలనుకుంటే... స్వయంగా ఓ నాలుగు ముక్కలు రాయొచ్చు కదా... ఇలా ట్వీట్ కాపీ చేయడమేంటని మండిపడుతున్నారు. అందులోనూ ప్రధాని మోదీ ట్వీట్ కాపీ చెయ్యడంపై ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు పైర్ అవుతున్నారు. సొంతంగా ట్వీట్ రాసేంత టైమ్ కూడా లేదా నీకు అంటూ తిట్టిపోస్తున్నారు.




    ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో ఉన్నా... సరైన ఆఫర్లు రాక... కిందా మీదా పడుతున్న ఊర్వశీ రౌతేలా... ఆ మధ్య యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌తో డేటింగ్ చేసింది. ఐతే... పంత్ ఇటీవల మరో యువతి వల్లో పడ్డాడు. దాంతో ఊర్వశీ ఒంటరైనట్లైంది. సోషల్ మీడియాలో అందచందాలు ఒలకబోస్తూ... యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ... ఈ ఒక్క ట్వీట్‌తో సంపాదించుకున్న నేమూ, ఫేమూ అన్నీ పోగొట్టుకున్నట్లైంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Narendra modi, Urvashi Rautela

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు