• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • URVASHI RAUTELA SAYS SHE HAS HUGE CRUSH ON ELON MUSK AND SHE WILL INVITE HIM TO HER BIRTHDAY PARTY SR

Urvashi Rautela : ఎలన్ మస్క్ అంటే పడి చస్తా.. : హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటెలా..

Urvashi Rautela : ఎలన్ మస్క్ అంటే పడి చస్తా.. : హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటెలా..

Urvasi Rautela and Elon Musk Photo : Facebook

Urvashi Rautela : ఊర్వశి రౌటేలా.. మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి హిందీలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ భామ హీందీలో ఎక్కువుగా గ్లామర్ పాత్రలకే పరిమితమై పోయింది. 

 • Share this:
  ఊర్వశి రౌటేలా.. మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి హిందీలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ భామ హీందీలో ఎక్కువుగా గ్లామర్ పాత్రలకే పరిమితమై పోయింది.  ఇప్పటికే అక్కడ 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు. ఈ భామ తెలుగులో కూడా ఓ చిత్రం చేస్తోంది. `బ్లాక్‌రోజ్`‌పేరుతో వస్తోన్న ఈ సినిమాను సూపర్ హిట్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నాడు. సంపత్ నంది కథను అందిస్తున్నాడు. స్నేహ గీతం, దొంగాట చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసిన మోహన్ భరద్వాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అది అలా ఉంటే నిన్న ఈ భామ తన 27వ పుట్టినరోజును జరపుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్ ఊర్వశీని ఇంటర్వూ చేసింది.  ఓ ప్రశ్నకు సమాదానంగా ఊర్వశీ తన బర్త్ డే పార్టీకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్‌ను పిలవాలనీ ఉందని.. అవకాశం వస్తే.. ఖచ్చితంగా అతన్ని పిలుస్తానని తెలిపింది. అంతేకాదు ఇంకా ఊర్వశీ మాట్లాడుతూ.. ఎలన్ మస్క్ అంటే తనకు క్రష్ అని కూడా తెలిపింది. ఇక ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కూడా పార్టీకి పిలుస్తానని తెలిపింది.

  ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. తన బర్త్ డే పార్టీకి ఖచ్చితంగా షారుఖ్ ఖాన్‌ను ఆహ్వానిస్తాని పేర్కోంది. నాల్గవ గెస్ట్‌గా హాలీవుడ్ నటి జెండయాను పిలుస్తానని తెలిపింది ఊర్వశీ. ఇక ఊర్వశీ సినిమాల విషయానికి వస్తే ఆమె 2019లో పాగల్ పంతీలో నటించింది. ఆ తర్వాత వర్జిన్ భానుప్రియ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది జీఫైవ్‌లో స్రీమ్ అవుతోంది. ఇక భామకు ప్రస్తుతం హిందీలో ఎటువంటీ సినిమా అవకాశాలు లేవు.


  తెలుగులో మాత్రం బ్లాక్ రోజ్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూరైంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఊర్వశీ తెలుగులో మరో సినిమాలో కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్పలో ఓ ఐటెమ్ సాంగ్‌లో ఊర్వశీ మెరవనుందని తెలుస్తోంది. పుష్ప ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటుంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  అగ్ర కథనాలు