దేవుడా.. ఆ హీరోయిన్ డ్రెస్ కోసం 730 గంటలు కష్టపడ్డారంట..

Urvashi Rautela: ఓ డ్రెస్ కోసం మహా అయితే ఎన్ని రోజులు కష్టపడతారు.. డిజైనింగ్ ఎక్కువగా రావాలంటే రెండు మూడు రోజులు సరిపోతుంది కదా.. మహా అయితే ఇంకా మూడు రోజులు.. కానీ ఓ డ్రెస్ కోసం మాత్రం ఏకంగా 730 గంటలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 20, 2020, 2:41 PM IST
దేవుడా.. ఆ హీరోయిన్ డ్రెస్ కోసం 730 గంటలు కష్టపడ్డారంట..
ఊర్వశి రౌతెలా హాట్ డ్రెస్ (urvashi rautela)
  • Share this:
ఓ డ్రెస్ కోసం మహా అయితే ఎన్ని రోజులు కష్టపడతారు.. డిజైనింగ్ ఎక్కువగా రావాలంటే రెండు మూడు రోజులు సరిపోతుంది కదా.. మహా అయితే ఇంకా మూడు రోజులు.. కానీ ఓ డ్రెస్ కోసం మాత్రం ఏకంగా 730 గంటలు కష్టపడ్డారు డిజైనర్స్. అది తెలిసిన తర్వాత అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఓ హీరోయిన్ డ్రెస్ కోసం డిజైనర్ చేసిన సాహసం ఇది. ఈ మధ్యే ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఘనంగా జరిగాయి. అందులో పాల్గొన్న ఊర్వశి రౌతెలా డ్రెస్ కోసమే ఈ అద్భుతం జరిగింది. అవార్డు వేడుకలకు వచ్చేటప్పుడు చాలా మంది హీరోయిన్లు అద్భుతమైన డిజైనర్ వేర్స్ వేసుకుని వస్తారు. అక్కడున్న కెమెరాలన్నీ తమ వైపు ఫోకస్ చేయాలని వాళ్లు కలలు కంటారు.
ఊర్వశి రౌతెలా హాట్ డ్రెస్ (urvashi rautela)
ఊర్వశి రౌతెలా హాట్ డ్రెస్ (urvashi rautela)

ఊర్వశి కూడా ఇదే చేసింది. ఈమె కూడా వైవిధ్యమైన డ్రెస్‌తో అవార్డు వేడుకకు వచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా 730 గంటలు కష్టపడి తయారు చేసిన డ్రెస్ వేసుకుని వచ్చింది ఈ ముద్గుగుమ్మ. మొత్తం ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకలో ఈమె డ్రెస్ ప్రత్యేకంగా నిలిచింది. ఎర్ర గులాబీలను పోలినట్లు ఉన్న ఈ డ్రెస్‌ను తయారు చేయడానికి ఆ డిజైనర్‌కు ఏకంగా 730 గంటలు పట్టిందని తెలుస్తుంది. ఈ డ్రెస్ కోసం 25 లక్షలు వెచ్చించింది ఈమె. ఊర్వశి వేడుకకి వచ్చి కూర్చున్నప్పుడు నలుగురు ఆసిస్టెంట్స్ వచ్చి ఆ డ్రెస్‌ను సరిచేసారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈమె కోసం ప్రత్యేకంగా నాలుగు కుర్చీలు కూడా పక్కన వేసారు. ఇప్పుడు ఈ రెడ్ డ్రెస్ ఫోటోలు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు