• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • URVASHI RAUTELA LOOKS SCORCHING HOT IN RED AND THE PRICE OF THE DRESS WILL SHOCK YOU MHN

Urvashi Rautela: రెడ్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ డాల్ ఊర్వశి రౌతేలా... డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవుతారు

Urvashi Rautela: రెడ్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ డాల్ ఊర్వశి రౌతేలా... డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవుతారు

Urvashi Rautela looks scorching hot in red and the price of the dress will shock you

Urvashi Rautela - Bollywood Heroine: గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా రీసెంట్‌గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు వేసుకున్న డ్రెస్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ డ్రెస్ చేయడానికి ఎన్ని పని గంటలు పట్టిందంటే...

  • Share this:
    ఊర్వ‌శి రౌతేలా... గ్లామ‌ర్‌తో పాటు అభినయంతో ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టి. ఇప్పుడు ఈమె కేవ‌లం బాలీవుడ్ న‌టి మాత్ర‌మే కాదండోయ్‌. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను కూడా మెప్పించ‌డానికి ఇక్క‌డ కూడా సినిమాల‌ను చేస్తుంది. ఐటెమ్ సాంగ్స్‌తోనూ మెప్పించ‌డానికి రెడీ అయిపోయింది. ఈ బ్యూటీ డాల్ లుక్‌, స్టైలింగ్ విష‌యంలో కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. గ్లామ‌ర్ దుస్తులే కాదు.. సంప్ర‌దాయ దుస్తుల్లోనూ చూప‌రుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఊర్వ‌శి రౌతేలా ముందుంటుంది. రీసెంట్‌గా మ‌రో స్టైలిష్ లుక్‌తో సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్‌ను, అభిమానుల‌ను అల‌రించింది.

    అద్భుత‌మైన రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఊర్వ‌శి రౌతేలా వేసుకున్న డ్రెస్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. అస‌లు అందాల బొమ్మ‌.. అందులోనూ ఆమె అందాన్ని రెట్టింపు చేసే డ్రెస్ దొరికితే ఇంకెలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు అని అన‌డానికి న్యూ ఇయ‌ర్ ఈవెంట్ రోజు ఆమె వేసుకున్న ఈ రెడ్ క‌ల‌ర్ డ్రెస్సే సాక్ష్య‌మ‌ని నెటిజ‌న్స్ ఊర‌శ్వి రౌతేలా బ్యూటీకి ఫిదా అయ్యారు.






    ఈ డ్రెస్ సెట్ చేయ‌డానికి మాత్రం డిజైన‌ర్స్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. దాదాపు 150 గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. ఈ డ్రెస్‌ను సిద్ధం చేయ‌డానికి అయిన ఖ‌ర్చు అక్ష‌రాలా న‌ల‌బై ఐదు వేల డాల్ల‌ర్లు అంటే.. మ‌న ఇండియ‌న్ ధ‌ర ప్ర‌కారం ముప్పై రెండు ల‌క్ష‌లు. ఇంత ఖ‌రీదైన డ్రెస్సును వేసుకున్న ఊర్వ‌శి రౌతేలా అందం మ‌రింత ఇనుమ‌డించింది మ‌రి. ఆమె అందంతో కుర్ర‌కారు పిచ్చేక్కిపోతుంది మ‌రి.
    Published by:Anil
    First published: